Anupama Parameswaran: ఒక్క సీన్‌తో కుర్రాళ్ళ గుండెల్లో గునపం దింపిన అనుపమ.. ఫ్యాన్స్ హర్ట్
శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అనుపమ.. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దాదాపు యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే నిన్న మొన్నటి వరకు పద్దతిగా .. పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. స్కిన్ షోకు, రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉండే అనుపమ ఈ మధ్య అందాలతో రెచ్చిపోతుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అనుపమ. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా నటించి ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అనుపమ.. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దాదాపు యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే నిన్న మొన్నటి వరకు పద్దతిగా .. పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. స్కిన్ షోకు, రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉండే అనుపమ ఈ మధ్య అందాలతో రెచ్చిపోతుంది. ఆ మధ్య రౌడీ బాయ్స్ సినిమాలో దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డికి లిప్ టు లిప్ కిస్ ఇచ్చి షాక్ ఇచ్చింది అనుపమ. ఆ దెబ్బనుంచే అనుపమ ఫ్యాన్స్ కోలుకోలేదు..
ఇటీవలే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. మునుపెన్నడూ లేని విధంగా అందాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్న అనుపమ ఇప్పుడు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోతుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాలో గత్తర లేపింది అనుపమ.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో అనుపమ అందాలతో రెచ్చిపోయింది. అంతే కాదు డీప్ లిప్ లాక్ తో అభిమానుల గుండెల్లో గునపం దింపింది. ట్రైలర్ లో హీరో సిద్దూ జొన్నలగడ్డకు డీప్ కిస్ ఇచ్చింది అనుపమ. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉందంటే సినిమాలో ఇంతకు మించి ఉంటుందని అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా మొన్నటి వరకు పద్దతిగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసి ఇలా రెచ్చిపోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.. అనుపమ డై హార్ట్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా డీజే టిల్లు కనే పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్
View this post on Instagram
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.




