హీరోగా మారనున్న మరో డాన్స్ మాస్టర్.. ఆ స్టార్ ప్రొడ్యుసర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన డాన్సర్.. ఎవరంటే ?

టాలెంట్‏తో పాటు నటించాలనే ఆసక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరు హీరో కావాలని ప్రయత్నిస్తుంటారు. ఏదో అవ్వాలని సినిమా

  • Rajitha Chanti
  • Publish Date - 6:00 pm, Wed, 20 January 21
హీరోగా మారనున్న మరో డాన్స్ మాస్టర్.. ఆ స్టార్ ప్రొడ్యుసర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన డాన్సర్.. ఎవరంటే ?

టాలెంట్‏తో పాటు నటించాలనే ఆసక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరు హీరో కావాలని ప్రయత్నిస్తుంటారు. ఏదో అవ్వాలని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిర్మాతలు, అసిస్టెంట్ డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్స్ ఇలా ఎవరో ఒకరు హీరోగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇటీవలే టాలీవుడ్ ఫేమస్ డాన్స్ మాస్టర్ జానీ కూడా హీరోగా ఓ సినిమాను స్టార్ట్ చేసాడు. ఇక అదే బాటలో మరో ఫేమస్ కొరియోగ్రాఫర్ కూడా హీరోగా నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫాపులర్ నిర్మాత దిల్‏రాజు.. వరుస సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది నూతన హీరోహీరోయిన్లను, దర్శకులను పరిచయం చేశాడు దిల్ రాజు. తాజాగా మరో నూతన హీరోను పరిచయం చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. డాన్స్ మాస్టర్ యశ్‏ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట దిల్ రాజు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నిర్మాణ పనులను మొదలు పెట్టినట్లుగా సమాచారం. ఈ ఏడాది దిల్ రాజు 5 సినిమాలను నిర్మించనున్నాడు. అందులో ఒకటి వకీల్ సాబ్ చిత్రీకరణ ఇటీవలే పూర్తిచేసుకుంది. ఇక రెండవది హీరో వెంకటేష్, వరుణ్ తేజ్‏లు నటిస్తున్న ఎఫ్ 3 మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే సమయంలో దిల్ రాజు నిర్మిస్తున్న మరో మూడు సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Also Read:

Pawan Kalyan : క్రిష్ సినిమా షూటింగ్ కు 20 రోజులు బ్రేక్ ఇవ్వనున్న పవన్.. ఈ గ్యాప్ లో..

ఆసుపత్రిలో చేరిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. ఆ సినిమా షూటింగ్‏లో ఉండగానే.. అసలు కారణం ఏంటంటే ?