Animal Movie: తన ఫేవరేట్ హీరోతో సినిమా తీయాలనుకున్న డైరెక్టర్ సందీప్.. ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా ?..
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీతో మరోసారి డైరెక్టర్ సందీప్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. సందీప్ తర్వాతి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా పేరును స్పిరిట్ అని ప్రకటించారు.

అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్.. ఇప్పుడు యానిమల్ మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీతో మరోసారి డైరెక్టర్ సందీప్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. సందీప్ తర్వాతి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా పేరును స్పిరిట్ అని ప్రకటించారు. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. వీరిద్దరే కాకుండా తన ఫేవరేట్ హీరోతో సినిమా చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టాడు. ఇంతకీ సందీప్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తన ఫస్ట్ సినిమా.. ‘అర్జున్ రెడ్డి’ తో అందర్నీ తన వైపుకు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో.. ఇండియన్ స్టార్ డైరెక్టర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. ఫిల్మ్ ఫెటిర్నిటీలో… హాట్ టాపిక్ అయ్యాడు. అలాంటి ఈ క్రేజీ అండ్ స్టార్ డైరెక్టర్.. తన ఫెవరెట్ హీరో చిరు తనయ రామ్ చరణ్ తో సినిమా చేయలాని అనుకుంటున్నాడట.
రీసెంట్‌గా మహబూబా బాద్ జిల్లా.. దంతాలపల్లికి వెళ్లిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అక్కడ తన నియర్ అండ్ డియర్స్‌తో.. తన మనసులో మాట చెప్పాడు. బాస్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రమే కాదు.. లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా… సినిమా తీసేందుకు వెయిట్ చేస్తున్నా అంటూ.. ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు వంగా..!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




