Animal 1st Day Collections: ‘యానిమల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ సెన్సెషన్.. రణబీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్..
భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 1న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఉదయం నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఎప్పటిలాగే బాక్సాఫీస్ వద్ద మరోసారి సందీప్ తన మార్క్ క్రియేట్ చేశాడు. అంతేకాదు. రణబీర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా యానిమల్ నిలిచింది. ఈ చిత్రానికి సౌత్ లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సందీప్ మేకింగ్.. రణబీర్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మాస్ యాక్షన్ హీరోగా రణభీర్ తన నటనతో అదరగొట్టేశారన రివ్యూస్ వస్తున్నాయి.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన చిత్రం యానిమల్. తండ్రి కొడుకుల అనుబంధం, ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఈ సినిమాలో రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్, విలన్ గా బాబీ డియోల్ నటించారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 1న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఉదయం నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఎప్పటిలాగే బాక్సాఫీస్ వద్ద మరోసారి సందీప్ తన మార్క్ క్రియేట్ చేశాడు. అంతేకాదు. రణబీర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా యానిమల్ నిలిచింది. ఈ చిత్రానికి సౌత్ లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సందీప్ మేకింగ్.. రణబీర్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మాస్ యాక్షన్ హీరోగా రణభీర్ తన నటనతో అదరగొట్టేశారన రివ్యూస్ వస్తున్నాయి.
ఇక మొదటిరోజే అడియన్స్ అంచనాలను దాటేసింది యానిమల్. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్ నిల్ ప్రకారం.. మొదటి రోజే భారతదేశంలో రూ.65 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా మొదటి రోజునే అత్యంత గౌరవనీయమైన మైలురాయిని దాటిన ఈ సంవత్సరంలో మూడవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. మొదటి రోజు మార్నింగ్ షోలు మధ్యాహ్నం షోలు 46%, 54% ఆక్యుపెన్సీని నివేదించాయి.
ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు 5 లక్షల టికెట్స్ సేల్ అయినట్లుగా తెలిసింది. బాహుబలి 2, జవాన్, పఠాన్, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఆల్ టైమ్ జాబితాలో ఐదవ స్థానంలో ఈ సినిమా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రాలో ఈ సినిమాకు అత్యధిక కలెక్షన్స్ వస్తున్నాయి. గతంలో రణబీర్ నటించిన బ్రహ్మాస్త్ర భారత్ లో రూ.36 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు అతను నటించిన సంజు మొదటి రోజే రూ.34 కోట్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు రాబట్టింది.
ఇక ఈ వీకెండ్లో యానిమల్ సినిమా సులభంగా రూ.350 కోట్ల వరకు వసూలు చేస్తుందని గతంలో చిత్రయూనిట్ అంచనా వేసింది. హిందీలో కబీర్ సింగ్ రూపొందించిన ఐదేళ్ల తర్వాత సందీప్ తెరకెక్కించిన సినిమా యానిమల్. కబీర్ సింగ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూళు చేశాడు.
Guys….. check this out https://t.co/oTHBRw8oMt
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.