Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. యాక్షన్, ఎమోషన్ సీన్లతో గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. చాలా కాలం తర్వాత యాక్షన్ మోడ్‌లో అదరగొట్టేశారు ప్రభాస్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ 1,2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. యాక్షన్, ఎమోషన్ సీన్లతో గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఖాన్సార్ సామ్రాజ్యం కోసం జరిగే పోరాటాల నేపథ్యంలో ఈ మూవీ ఉన్నట్టు అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత యాక్షన్ మోడ్‌లో అదరగొట్టేశారు ప్రభాస్. రవి బస్రూర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఇంటెన్స్‌గా సాగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సలార్ ప్రెస్ మీట్స్ నిర్వహించనుంది చిత్రయూనిట్. ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం మనదేశంలో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ కానున్నాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
#Salaar advance booking opens India-wide on 𝐃𝐞𝐜𝐞𝐦𝐛𝐞𝐫 𝟏𝟓𝐭𝐡 🇮🇳🎟️💥
Get ready to grab your tickets and witness the epic saga unfold on the big screen! 🎬#SalaarTrailer: https://t.co/n1ppfmkpoI#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur… pic.twitter.com/LwEExVJFuX
— Hombale Films (@hombalefilms) December 1, 2023
యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరరావు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు అనేది సలార్ సినిమా.
𝐏𝐥𝐞𝐚𝐬𝐞…𝐈…𝐊𝐢𝐧𝐝𝐥𝐲…𝐑𝐞𝐪𝐮𝐞𝐬𝐭!
Unleashing #SalaarTrailer: https://t.co/n1ppfmkpoI#Salaar #SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart… pic.twitter.com/KSlG2RjFW5
— Hombale Films (@hombalefilms) December 1, 2023
𝐏𝐥𝐞𝐚𝐬𝐞…𝐈…𝐊𝐢𝐧𝐝𝐥𝐲…𝐑𝐞𝐪𝐮𝐞𝐬𝐭!
Unleashing #SalaarTrailer: https://t.co/n1ppfmkpoI#Salaar #SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart… pic.twitter.com/KSlG2RjFW5
— Hombale Films (@hombalefilms) December 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.