Animal Review: యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
ఒక్క ట్రైలర్! ఒకే ఒక్క ట్రైలర్ యానిమల్ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ వైపే అందరూ చూసేలా చేసింది. రణ్‌బీర్ ఇంటెన్స్ యాక్టింగ్ గురించి.. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టేకింగ్ గురించి స్టోరీ టెల్లింగ్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. అంతటి బజ్ క్రియేట్ చేసిన తాజాగా రిలీజ్ అయింది. మరి సినిమా టాక్ ఎలా ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయిందా? లేక తీసిపారేసేలానే ఉందా? తెలుసుకోవాలంటే.. లెట్స్ వాచ్ దిస్ రివ్యూ..!
ఒక్క ట్రైలర్! ఒకే ఒక్క ట్రైలర్ యానిమల్ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ వైపే అందరూ చూసేలా చేసింది. రణ్‌బీర్ ఇంటెన్స్ యాక్టింగ్ గురించి.. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టేకింగ్ గురించి స్టోరీ టెల్లింగ్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. అంతటి బజ్ క్రియేట్ చేసిన తాజాగా రిలీజ్ అయింది. మరి సినిమా టాక్ ఎలా ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయిందా? లేక తీసిపారేసేలానే ఉందా? తెలుసుకోవాలంటే.. లెట్స్ వాచ్ దిస్ రివ్యూ..! ఇండియాలోనే రిచెస్ట్ ఫ్యామిలీ, బిజినెస్ మెన్ బల్బీర్ సింగ్ అలియాస్ అనిల్ కపూర్. అతడికి స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది. రణ్ విజయ్ సింగ్ అలియాస్ రణబీర్ కపూర్ ఆయన కుమారుడు. చిన్నప్పటి నుంచి కూడా చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా తన కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు.. ఏ చిన్న తప్పును కూడా సహించడు.. ఏ ఇబ్బంది వచ్చినా చంపేసేంత అగ్రెసివ్. ఆ కోపాన్ని చూసి కొడుకును హాస్టల్‌లోనే ఉంచేస్తాడు బల్బీర్. ఆ తర్వాత అక్క భర్తతో జరిగిన చిన్న గొడవ కారణంగా తను ప్రేమించిన గీతాంజలి అలియాస్ రష్మిక మందన్నను తీసుకుని అమెరికా వెళ్లిపోతాడు రణ్ విజయ్. కొన్నేళ్ల తర్వాత తండ్రిపై అటాక్ జరిగిందని తెలుసుకుని ఇండియాకు వస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఏం జరిగింది.. అసలెందుకు బల్బీర్‌పై అటాక్ జరిగింది.. చేసిన వాళ్లెవరు.. ఇవన్నీ తెలుసుకునే క్రమంలో విజయ్ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అదేంటనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాలి. ప్రమోషనల్ ఇంటర్య్వూల్లో చెప్పినట్టే.. చాలా సింపుల్ కథను తన స్టైల్లో తీసాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..!
మేకింగ్ అయితే మరో స్థాయిలో ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్. అలాగే రైటింగ్ కూడా అంతే.. ఒక స్టార్ హీరోతో ఇలాంటి సినిమా ఊహించడం కష్టం. రణబీర్ కపూర్ కథను కాదు సందీప్ వంగాను నమ్మి ఈ సినిమా చేశాడని అర్థమవుతుంది. ఆ మేకింగ్ కు మెంటల్ వచ్చేస్తుంది.. ఇక ఫస్టాఫ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.. చిన్న కంప్లైంట్ కూడా లేదు. కానీ సెకండాఫ్ మాత్రం అక్కడే తిరిగింది. ఒరిజినల్ మేకింగ్ పేరుతో అక్కడక్కడ కాస్త డోస్ బాగా పెంచాడు సందీప్. అది హాట్ సీన్స్ కానీ.. వయోలెన్స్ కానీ.. ఎక్కడ మొహమాటమే పడలేదు. సెకండాఫ్ చాలా వరకు స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. ఆయన ఇష్టపడి చేసిన సినిమా కాబట్టి ట్రిమ్ చేయలేకపోయాడేమో కానీ.. కొన్ని సన్నివేశాలు బాగా విసిగిస్తాయి. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. రణబీర్ కపూర్ నటన మరో స్థాయిలో ఉంది.. అసలు ఆ పాత్రను ఆయన ఓన్ చేసుకున్న తీరు అద్భుతం అంతే. ఇక తండ్రి పాత్రలో అనిల్ కపూర్ అద్భుతంగా నటించాడు. బాబీ డియోల్ ఉన్నది కాసేపే అయినా కూడా చాలా బాగుంది ఆయన కారెక్టర్. రష్మిక మందన క్యారెక్టర్ చాలా బోల్డ్‌గా ఉంది. శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా సహా మిగిలిన వాళ్లంతా ఓకే. ఇక వీరందరికి తోడు సినిమాకు సంగీతం సగం బలం. హర్షవర్ధన్ రామేశ్వర్ ఆర్ఆర్ అదిరిపోయింది. చాలా సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక ఓవరాల్‌గా యానిమల్.. గురించి చెప్పాలంటే.. Sandeep Reddy Vanga’s Version of నాన్నకు ప్రేమతో..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.