TOP 9 ET: అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా.. మ్యాడ్‌ అంతే.!

TOP 9 ET: అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా.. మ్యాడ్‌ అంతే.!

Anil kumar poka

|

Updated on: Dec 01, 2023 | 9:09 PM

ద వెయిటింగ్ ఈజ్‌ ఓవర్‌..! సలార్ ట్రైలర్‌ రిలీజ్‌డ్‌! ఎస్ ప్రభాస్‌ ద మోస్ట్ అవేటెడ్ సలార్ మూవీ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్‌ అయింది. ప్రభాస్ కటౌట్‌ అండ్ యాక్షన్ సీన్స్ అందరికీ గూస్ బంప్స్‌ పుట్టిస్తోంది. ఈ డైనోసార్‌ను థియేటర్లో చూడాల్సిందే అనే ఫీలింగ్ కలిగిస్తోంది. | రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ జైలర్. ఈ చిత్రం తమిళనాట రికార్డులు తిరగరాసింది. కేవలం సినిమా మాత్రమే కాదు..

01.Animal
రణ్బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగా డైరక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ యానిమల్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సందీప్ మేకింగ్.. స్టోరీ టెల్లింగ్.. అండ్ రణ్బీర్ యాక్టింగ్ గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. చూసిన వారు వావ్‌ అనేలా.. యాక్షన్ సీన్స్‌ చూసి మ్యాడ్‌ ఫీలింగ్‌కు లోనయ్యేలా చేస్తోంది.

02.prabhas
ద వెయిటింగ్ ఈజ్‌ ఓవర్‌..! సలార్ ట్రైలర్‌ రిలీజ్‌డ్‌! ఎస్ ప్రభాస్‌ ద మోస్ట్ అవేటెడ్ సలార్ మూవీ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్‌ అయింది. ప్రభాస్ కటౌట్‌ అండ్ యాక్షన్ సీన్స్ అందరికీ గూస్ బంప్స్‌ పుట్టిస్తోంది. ఈ డైనోసార్‌ను థియేటర్లో చూడాల్సిందే అనే ఫీలింగ్ కలిగిస్తోంది.

03.Rajinikanth:
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ జైలర్. ఈ చిత్రం తమిళనాట రికార్డులు తిరగరాసింది. కేవలం సినిమా మాత్రమే కాదు.. ఆడియోకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హుకుం పాట అయితే దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు.

04.Leo
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కమర్షియల్ బ్లాక్‌బస్టర్ లియో. ఈ సినిమా దాదాపు 550 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్ర ఓటిటి వర్షన్ ఇప్పటికే విడుదలైంది. అయితే దీనికి ఇంగ్లీష్ వర్షన్ కూడా సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రముఖ ఓటిటిలో డిసెంబర్ 26 నుంచి ఈ ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి రానుంది.

05.prithviraj
మనుగడ కోసం చేస్తున్న సాహసం అంటూ తన ఆడుజీవితం సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఆడుజీవితం. నమ్మశక్యం కాని ఓ నిజమైన కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు పృథ్విరాజ్‌.

06.malavika
విక్రమ్‌ హీరోగా నటిస్తున్న సినిమా తంగలాన్‌. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌ నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్‌ పనులు మొదలయ్యాయని, తనకు డబ్బింగ్‌ చెప్పడం చాలా కష్టమని అన్నారు మాళవిక. వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది తంగలాన్‌.

07.Nayan
ప్రముఖ హీరోయిన్‌ నయనతారకు మెర్సిడెస్‌ బెంజ్‌ మే బ్యాక్‌ కారును గిఫ్ట్ గా ఇచ్చారు ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌. నవంబర్‌ 18న ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు. బర్త్ డే గిఫ్ట్ గా కారు ఇచ్చినట్టు తెలిపారు విఘ్నేష్‌. నయనతార నటించిన అన్నపూరణి ఇవాళ విడుదలైంది.

08. Naa Samiranga
నాగార్జున హీరోగా కొరియోగ్రఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా నా సామిరంగా. ఈ చిత్ర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు నాగార్జున. డిసెంబర్ 7 నాటికి టాకీ పార్ట్ పూర్తి కానుందని తెలుస్తుంది.

09.Main Atal Hoon
అటల్ బిహారీ వాజ్‌పాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘మై అటల్ హూ’. విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమా 2024 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్‌ డేట్‌తో పాటు వాజ్‌పాయిగా పంకజ్‌ లుక్‌ను కూడా రివీల్ చేసింది చిత్రయూనిట్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.