AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: నా ఇంటర్వ్యూని వైరల్ చేయకండి.. రిక్వెస్ట్ చేసిన యాంకర్ రష్మీ

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ మూగజీవాల సంరక్షణకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో జరిగే సంఘటనల పై కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ తన ఇంటర్వ్యూని వైరల్ చెయ్యొద్దు అని విజ్ఞప్తి చేసింది. కాస్టింగ్ కౌచ్ పై తన చేసిన కామెంట్స్ ను వైరల్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేసింది.

Rashmi Gautam: నా ఇంటర్వ్యూని వైరల్ చేయకండి.. రిక్వెస్ట్ చేసిన యాంకర్ రష్మీ
Rashmi Gautam
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2024 | 3:03 PM

Share

యాంకర్ రష్మీ తన టీవీ షోలతో పాటు నిత్యం ఏదోఒక విషయం పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూనేవుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ మూగజీవాల సంరక్షణకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో జరిగే సంఘటనల పై కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ తన ఇంటర్వ్యూని వైరల్ చెయ్యొద్దు అని విజ్ఞప్తి చేసింది. కాస్టింగ్ కౌచ్ పై తన చేసిన కామెంట్స్ ను వైరల్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేసింది. ఇంతకూ అసలు రష్మీ ఏమన్నది.? ఎందుకు ఆ ఇంటర్వ్యూని వైరల్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేసింది.?

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వస్తూనే ఉంది. రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పోలీసుకు అదుపులోకి తీసుకుంటున్నారు. యువతిని వేధించిన కేసులో ఇప్పటికే హీరో రాజ్ తరుణ్,కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,ఇప్పుడు యూట్యూబర్ హర్షసాయి పై ఆరోపణలు వచ్చాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపుల పై పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రష్మీకి సంబందించిన ఓ పాత ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

గతంలో రష్మీ మాట్లాడుతూ.. మైనర్‌ను లైంగికంగా వేధింపులకు గురిచేయడం, క్యాస్టింగ్‌ కౌచ్‌కు చాలా తేడా ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించింది అని రష్మీ అన్నారు. అలాగే ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఇలాంటివి ఎదురైనప్పుడు నో చెప్పాలని. కానీ కొంతమంది కెరీర్ లో ముందుకు వెళ్లడం కోసం ఇలాంటివి ఎదురైనప్పుడు ఓకే చెప్తున్నారని రష్మీ అన్నారు. కానీ ఎవరిని ఎవరూ బలవంతం చేయరు. ఒక వేళ అత్యాచారం చేస్తే తప్పు అని రష్మీ చెప్పుకొచ్చింది. అయితే ఈ కామెంట్స్‌ను జానీ మాస్టర్ కేసు ఉద్దేశించే రష్మీ చేసిందని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో ఆమె అది పాత ఇంటర్వ్యూ అని దయచేసి దాన్ని వైరల్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.