Bigg Boss 8 Telugu: ఓటింగ్‏లో వరంగల్ కుర్రాడు సంచలనం.. డేంజర్ జోన్‏లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్..

సోమవారం నుంచి ఓటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పుడు వరంగల్ కుర్రాడు నబీల్ హయ్యేస్ట్ ఓటింగ్ తో సంచలనం సృష్టిస్తున్నారు. ఒక్కరోజే ఈ కుర్రాడికి 35 శాతం ఓటింగ్ వచ్చినట్లు సమాచారం. అంతకు ముందు విష్ణు ప్రియ, నిఖిల్ ఇద్దరికి ఈ రేంజ్ ఓటింగ్ వచ్చేసింది. కానీ ఇప్పుడు వారిద్దరి కంటే ఎక్కువగా ఓటింగ్ తో రికార్డ్స్ బ్రేక్ చేశాడు.

Bigg Boss 8 Telugu: ఓటింగ్‏లో వరంగల్ కుర్రాడు సంచలనం.. డేంజర్ జోన్‏లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్..
Bigg Boss 8 Telugu Voting
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2024 | 1:31 PM

బిగ్‏బాస్ నాలుగో వారం నామినేషన్స్ ఓటింగ్ రిజల్ట్స్‏ను ఒక్కసారిగా మార్చేశాయనే చెప్పాలి. మొన్నటివరకు ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న కంటెస్టెంట్స్.. మొన్నటి నామినేషన్స్ తర్వాత అనుహ్యంగా టాప్ లోకి దూసుకెళ్లారు. ముఖ్యంగా సోనియాను ఢీకొట్టిన ఇద్దరు సభ్యులు ఓటింగ్ లో భీభత్సం సృష్టిస్తున్నారు. నాలుగోవారం మొదటి రోజు ఓటింగ్ లో యూట్యూబర్ నబీల్ అత్యధిక ఓటింగ్‏తో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ లో నబీల్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం నబీల్, సోనియా, పృథ్వీరాజ్, ప్రేరణ, ఆదిత్య ఓం, మణికంఠ నామినేట్ అయ్యారు. సోమవారం నుంచి ఓటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పుడు వరంగల్ కుర్రాడు నబీల్ హయ్యేస్ట్ ఓటింగ్ తో సంచలనం సృష్టిస్తున్నారు. ఒక్కరోజే ఈ కుర్రాడికి 35 శాతం ఓటింగ్ వచ్చినట్లు సమాచారం. అంతకు ముందు విష్ణు ప్రియ, నిఖిల్ ఇద్దరికి ఈ రేంజ్ ఓటింగ్ వచ్చేసింది. కానీ ఇప్పుడు వారిద్దరి కంటే ఎక్కువగా ఓటింగ్ తో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. నబీల్ తర్వాత రెండో స్థానంలో మణికంఠ ఉన్నాడు. ఇప్పటివరకు అతడికి 17 శాతం ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది.

ఇక మూడో స్థానంలో ప్రేరణ నిలిచింది. ఆమెకు ఇప్పటివరకు 13 శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రేరణ కొన్నిసార్లు అనవసర పాయింట్స్ మాట్లాడినప్పటికీ టాస్కులలో గట్టి పోటినిస్తుంది. ఇక నాలుగో స్థానంలో ఆదిత్య ఓం నిలిచాడు. సోనియా పై కోపంతో నిఖిల్ ఫ్యాన్స్ తమ ఓటింగ్ చీల్చినట్లు తెలుస్తోంది. దీంతో ఊహించని విధంగా సోనియా కంటే ఎక్కువ ఓటింగ్ ఆదిత్య ఓంకు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆదిత్యకు 12 శాతం ఓటింగ్ రాగా.. హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పృథ్వీ, సోనియాకు అతి తక్కువ ఓటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వీరిద్దరికి సమానంగా 8 శాతం ఓట్లు పడుతున్నాయి.

ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ చూస్తే డేంజర్ జోన్ లో సోనియా, పృథ్వీ ఉన్నారు. అయితే ఇద్దరి ఓటింగ్ శుక్రవారం వరకు ఇలాగే కొనసాగుతుందా.. లేదా ఈ వారం మొత్తం టాస్కులలో ఇద్దరి పర్ఫార్మెన్స్ చూసి ఏమైనా మారుతుందా అనేది చెప్పలేం. ఒకవేళ ఇద్దరిని సేవ్ చేయడానికి బిగ్‏బాస్ మరో కంటెస్టెంట్ ను బలి చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వారం నామినేషన్స్ లో నబీల్, యష్మీ కరెక్ట్ పాయింట్స్ తో సోనియాకు ఇచ్చిపడేసారు. ముఖ్యంగా ఫెయిల్డ్ సంచాలక్ అంటూ నబీల్ ను మరింత రెచ్చగొట్టింది సోనియా. దీంతో నబీల్ సైతం గట్టిగానే కౌంటరిచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.