Brahmamudi, September 25th Episode: ఏకమైన అనామిక, రుద్రాణిలు.. తెలీకుండా ఇరుక్కున్న కావ్య!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణను పరామర్శించడానికి దుగ్గిరాల ఇంటికి వస్తుంది కనకం. కావాలనే కనకాన్ని సూటి పోటి మాటలు ఆడుతూ రెచ్చగొట్టాలని రుద్రాణి అనుకుంటుంది. ఏంటి పిలవని పేరంటానికి వచ్చావు అని అడుగుతుంది. ఈ సాకుతో కూతుర్ని అత్తారింటికి పంపించి చేతులు దులిపుకోవాలని వచ్చావా? మీకే తిండికి గతిలేదు.. మీ కూతురికి ఏం పెడతారు పాపం.. అందుకని మళ్లీ ఇక్కడికి పంపించాలని చూస్తున్నావేమో..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణను పరామర్శించడానికి దుగ్గిరాల ఇంటికి వస్తుంది కనకం. కావాలనే కనకాన్ని సూటి పోటి మాటలు ఆడుతూ రెచ్చగొట్టాలని రుద్రాణి అనుకుంటుంది. ఏంటి పిలవని పేరంటానికి వచ్చావు అని అడుగుతుంది. ఈ సాకుతో కూతుర్ని అత్తారింటికి పంపించి చేతులు దులిపుకోవాలని వచ్చావా? మీకే తిండికి గతిలేదు.. మీ కూతురికి ఏం పెడతారు పాపం.. అందుకని మళ్లీ ఇక్కడికి పంపించాలని చూస్తున్నావేమో.. అది ఈ జన్మలో జరగదని మా రాజ్ ఎప్పుడో చెప్పాడు. అయినా అస్సలు ఏమీ పట్టించుకోకుండా.. అపర్ణను వెళ్లి పలకరిస్తుంది కనకం. మీ ఆరోగ్యం ఎలా ఉంది వదినా అని అడుగుతుంది. బాగానే ఉందని అపర్ణ అంటుంది. అబ్బా ఏం అభిమానం.. కూతురేమో ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.. ఇప్పుడు తల్లి వచ్చి కుశలం కనుక్కోవడం వచ్చిందని అంటుంది. రుద్రాణి.. నాకు ఆవేశం తెప్పించకు అని వార్నింగ్ ఇస్తుంది. పర్వాలేదు వదినా మాట్లాడనివ్వండి. మీ ఇంట్లో శుభమా అని పూజ చేసుకున్నారు. నేను రావడం వల్ల ఎలాంటి గొడవ రాకూడదని చాలా కూల్‌గా సమాధానం ఇస్తుంది.
కొబ్బరి కాయకు బదులు..
అవునులే తమ జన్మకు సిగ్గా.. శరమా అని అంటుంది రుద్రాణి. ఏదన్నా జరిగితే అది నాకూ కళావతికి మధ్య జరిగింది. ఇందులో వాళ్లకు ఏం సంబంధం లేదని రాజ్ అంటాడు. మా ఇంట్లో గొడవ జరగకూడదు అని అనుకుంటే.. కొబ్బరి కాయకు బదులు.. ఇంకొకటి పగిలిందని స్పప్న అంటుంది. వదినను పలకరించడానికి వచ్చాను. ఆస్పత్రికే వచ్చి పలకరిద్దామని అనుకున్నా. కానీ ఈలోపే చాలా జరిగాయి. మీరేమీ పట్టించుకోకండి.. భగవంతుడు అందర్నీ చల్లగా చూస్తాడని కనకం అంటుంది. ఇదేంటి మంచిగా ఉన్నట్టు నటించి.. మార్కులు కొట్టేయాలని చూస్తుందా.. వీల్లేదు దీన్ని రెచ్చగొట్టాలని రుద్రాణి అనుకుని.. అయినా ఏం మొహం పెట్టుకుని వచ్చావు.. వీళ్ల సంగతి నీకు తెలీదు. ఇన్ని రోజులూ రానిది.. ఇప్పుడు ఎందుకు వచ్చింది? తన కూతుర్ని తీసుకు రాకపోయేసరికి తనే వచ్చిందని రుద్రాణి అంటుంది. ఇప్పటిదాకా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? మళ్లీ ఆ ఇంటి నుంచి రాకపోకలు మొదలు పెట్టి.. ఆ కూతుర్ని.. ఈ కూతుర్ని ఇక్కడ చేర్చాలనే కదా ఆవిడ ప్లాన్ అని ధాన్య లక్ష్మి అంటుంది.
కావ్య సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు..
ధాన్యలక్ష్మి నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్.. నా చిన్న కూతురు నువ్వు రమ్మన్నా రాదు.. నా పెద్ద కూతురు వాళ్ల అత్త పొమ్మన్నా పోదు.. ఇక కావ్య సంగతి ఆ దేవుడే చూసుకుంటాడని కనకం అంటుంది. అంటే ఇంకా నీ కూతుర్ని మా రాజ్ తీసుకొస్తాడా అని రుద్రాణి అంటే.. అందుకు సాక్ష్యం ఈ చీరనే. రాముడు కాంచన సీతను పెట్టుకుని యాగం చేసినట్టు.. నా కూతురు చీర పెట్టి ఈ పూజ చేశారు. నాకు ఇంకా నమ్మకం ఉంది. ఇంకొక విషయం అది భగవంతుడి సంకల్పం తప్ప.. మానవ మాత్రులు ఎవరూ చేయలేనిది. నా కూతురు తన చేతులతో చేసిన ఈ విగ్రహం మీ ఇంటికే వచ్చి చేరింది. అది ఎవరు ప్లాన్ చేస్తే జరిగింది.. నా కూతురు చేసిన దేవుడే వచ్చాడు.. నా కూతురు రాదా.. అని కనకం అనే సరికి.. అందరూ ఆలోచనలో పడతారు.
అనామిక వలలో ఇరుక్కున్న కావ్య..
ఆ తర్వాత అనామిక కావ్యని బోల్తా కొట్టడానికి ప్లాన్ చేస్తుంది. ఒక అతన్ని తీసుకొచ్చి.. ఆ కావ్య మా కంపెనీలో పని చేయడానికి అస్సలు ఒప్పుకోదు. కాబట్టి నువ్వు నీ కంపెనీలో పని చేస్తున్నట్టు నమ్మించి.. తను వేసే డిజైన్స్ మాకు ఇవ్వాలని అనామిక డిమాండ్ చేస్తుంది. అప్పుడే కావ్య వచ్చినట్టు ప్యూన్ చెప్తాడు. ఇక అతను వెళ్తాడు. సర్ నేను చెప్పాను కదా కావ్య అని ఈమె కదా.. అని సందీప్ అంటాడు. మీ గురించి నేను విన్నాను అండీ.. మీరు గతంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పని చేశారు కదూ.. ఇక్కడ కూడా మీరు అంతే క్రియేటీవ్‌గా పని చేసి మాకు డిజైన్స్ ఇవ్వాలి. అయితే మీకు ఆ కంపెనీ వాళ్లు ఇచ్చినంత శాలరీ ఇవ్వలేమని అంటాడు. థాంక్యూ సర్.. నాకు బ్రతకడానికి మాత్రమే డబ్బు కావాలి అని చెప్పి కావ్య వెళ్తుంది. దీంతో అనామిక సంబర పడుతుంది. తర్వాత ఆ వ్యక్తి వచ్చి మేడమ్ అంతా మీరు చెప్పినట్లే చేశానని అంటాడు. ఏంటి సాలరీ అంటూ ఓవరాక్షన్ చేశావ్? తన భర్తకు వ్యతిరేకంగా తాను పని చేస్తున్నానని కావ్యకు తెలిస్తే వెంటనే మానేస్తుంది. తను వేసే డిజైన్స్ మనకు చాలా అవసరం అని అనామిక అంటుంది. డోంట్ వర్రీ అదంతా నేను చూసుకుంటానని సామంత్ అంటాడు.
పుట్టింటికి రావడమే నువ్వు చేసిన తప్పు..
ఇక కావ్య ఇంటికి వస్తుంది. తనకు జాబ్ వచ్చినట్టు తల్లిదండ్రులకు చెబుతుంది. దీంతో కృష్ణమూర్తి సంతోషిస్తాడు. కనకం మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఏమైంది అమ్మా అలా ఉన్నావు? అని అడుగుతుంది కావ్య. నీతో మాట్లాడటానికి నేను ఎంతటి దాన్ని? పెద్ద పెద్ద మహాను భావులే నీకు సమాధానం చెప్పలేక పక్కకు తప్పుకున్నారు? అని కనకం అంటే.. అదేంటి? అమ్మా నేను నా కాళ్ల మీద నిలబడటం కూడా తప్పేనా? అని కావ్య అంటే.. తప్పు, ఒప్పులను ఏ గీత దగ్గర వేరు చేయాలో కూడా నాకు తెలీదని కనకం అంటుంది. అలా మాట్లాడుతున్నావేంటి? అమ్మా .. నేను తప్పు చేసి ఇంటికి వచ్చాను అనుకుంటున్నావా అమ్మా అని కావ్య అంటుంది. పుట్టింటికి రావడమే నువ్వు చేసిన తప్పు అని కనకం అంటుంది. అందేంటి అమ్మా.. అందుకే నేను ఇంట్లోకి వచ్చేముందు మీ పర్మిషన్ అడిగాను. అప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నావు కదా అమ్మా అని అడుగుతుంది కావ్య. ఆ సమయంలో ఎవరైనా అలాగే అంటారే. అత్త మామలు కట్నం కోసం ఇబ్బంది పెడుతుంటేనే.. అల్లుడు వ్యసనపరుడై చిత్ర హింసలు పెడుతూ ఉంటే తట్టుకోలేక పుట్టింటికి వచ్చే కూతుళ్ల సంగతి వేరు. కానీ నీ కథ వేరని కనకం అంటుంది.
నాకు ఆత్మాభిమానం ఉంది..
అంటే ఎన్ని మాటలు అన్నా.. ఎలాంటి మాటలు అన్నా తల వంచుకుని ఉండాలా.. అని కావ్య అంటుంది. నిజంగా ద్వేషం ఉన్నవాడు నిన్ను తీసుకెళ్లడానికి ఎందుకు ఇంటికి వస్తాడు. కోపంలో ఉన్న మాటలు ఆ తర్వాత వాళ్లకే తప్పుగా అనిపిస్తాయని కనకం అంటే.. వాళ్ల అమ్మ కోసమని కావ్య అంటుంది. ఆయన ఏమన్నాడో అవి ఎంతగా నా గుండెల్ని ముక్కలు చేశాయో నీకు అర్థం కావడం లేదని కావ్య అంటుంది. కానీ ఆ ఇద్దరి మధ్య ఓ బంధం ఉంటుంది. ఆ బంధాన్ని అహంకారంతో, ఆత్మాభిమానంతో తెంచుకోకూడదు. భర్త ముందు భార్య తగ్గితే ఏం జరుగుతుంది చెప్పు? అని కనకం అంటే.. వ్యక్తిత్వం చచ్చిపోతుంది. సంవత్సరం పాటు నేను అవమానాలు, మాటలు పడ్డప్పుడు నువ్వు చెప్పినప్పుడే ఉన్నానా.. కానీ నా భర్తే నన్ను పరాయి దాన్ని చేస్తే.. ఏ స్థానంలో ఉండాలి? అది నా ఇల్లు ఎలా అవుతుంది? అందుకే వచ్చాను.. నేను మీకు భారంగా అనిపిస్తే.. బయటకు వెళ్లిపోతానని కావ్య అంటుంది.
భారమైతే.. బయటకు వెళ్లిపోతా..
అమ్మ సమాజానికి భయపడి.. కన్న కూతుర్ని వ్యక్తిత్వం చంపుకుని బ్రతకమని మాట్లాడడుతుందని కావ్య అంటుంది. లేదే సంవత్సరం పాటు అందర్నీ క్షమించిన దానివి.. కానీ క్షణం పాటు నీ భర్తని క్షమిస్తే నీ కాపురం నిలబడుతుందని ప్రయత్నిస్తున్నా.. అత్తింటి నుంచి అలిగి పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల నచ్చని మాట అంటే పడదని నాకు తెలుసు. బాధలో కోపంలో తీసుకున్న ఏ నిర్ణయమైనా సరైనది కాదు. స్వతంత్రంగా బతకాలని ఆలోచన నీకు వచ్చింది. దీంతో నీకు అత్తింటి అవసరం తగ్గిపోతుంది. అందుకు నేనే భయ పడుతున్నానని కనకం అంటే.. నేను తిరిగి రావాలని వాళ్లు కాదు.. నా భర్త కోరుకుంటున్నాడని అనుకోవడంలో నాకు నమ్మకం లేదు. అలాంటప్పుడు నేను బ్రతకడంలో తప్పు లేదని కావ్య అంటుంది.
ఆఫీస్‌కి రాజ్..
ఆ తర్వాత దుగ్గిరాల ఇంటికి సీతారామయ్య ఫ్రెండ్ వస్తాడు. ఏంట్రా బాగున్నారా? అని అడుగుతాడు. హా అందరం బాగానే ఉన్నామని అంటాడు రాజ్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చానని అంటాడు అతను. నా మనవడు శ్రీకాంత్ తెలుసు కదా అని అడిగితే.. మీరు తాతయ్య ఎలా బిజినెస్ చేశామో.. ఇప్పుడు మేము కూడా అలానే బిజినెస్ చేస్తున్నామని అంటాడు. కానీ ఇప్పుడు శ్రీకాంత్ మీతో బిజినెస్ చేయడం ఇష్టం లేదని అంటాడు. ఏ ఏమైందని రాజ్ అడుగుతాడు. మర్యాద తక్కువైంది. రాహుల్ తనని అవమానించాడట అని చెప్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..