Bigg Boss 8 Telugu: సోనియాకు షాకిచ్చిన యష్మీ.. నిఖిల్ టీంలో ఆ ఇద్దరే స్పై.. టాస్కులలో పోటాపోటీ..
అందరికి మీరిద్దరూ అంటే ఇష్టం కదరా.. మరి నేను ఏం పాపం చేసినా..మీ ఇష్టానికి నేను ఎందుకు బలి కావాలి అంటే చెప్పుకొచ్చింది సోనియా. మణికంఠ, యష్మీ ఇద్దరు స్పై (గూఢచారి)లానే బిహేవ్ చేస్తారు అని నిఖిల్ తో చెప్పింది సోనియా. చివరకు నిఖిల్ టీంలో నలుగురు సభ్యులు ఉండగా.. సీత టీంలో ఐదుగురు సభ్యులు ఉండడంతో వారిని డ్రాగన్ ఫ్లై రూమ్ వాడుకోవాలని సూచించాడు బిగ్బాస్.
బిగ్బాస్ హౌస్లో ముందు నుంచి నిఖిల్ శక్తి టీం చీఫ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొత్త కిర్రాక్ సీత కూడా కాంతార టీంకు చీఫ్ అయ్యింది. దీంతో మరోసారి రెండు క్లాన్ సభ్యులను సెలక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో విష్ణుప్రియ, నైనిక, నబీల్, ఆదిత్య, యష్మీ అందరూ సీత టీంలోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించారు. చివరకు ప్రేరణ, మణికంఠ కూడా సీత టీంలోకి వెళ్లాలని ఉందని చెప్పడంతో స్వాప్ చేసుకోవాలని సూచించాడు బిగ్బాస్. కానీ ఎవరిని స్వాప్ చేయాలేనని సీత చెప్పడంతో చివరకు మణికంఠ, యష్మీ ఇద్దరూ నిఖిల్ టీంలోకి వెళ్లారు. దీంతో సోనియా ఒక్కసారిగా షాకయ్యింది. అటు నిఖిల్ టీమ్ గురించి తన టీం సభ్యులతో మాట్లాడుతూ కౌంటర్స్ ఇచ్చింది సీత. ఇక పెద్దొడు, చిన్నోడు ఇద్దరికి అర్దరాత్రి జాగ్రత్తలు చెప్పింది సోనియా. అందరికి మీరిద్దరూ అంటే ఇష్టం కదరా.. మరి నేను ఏం పాపం చేసినా..మీ ఇష్టానికి నేను ఎందుకు బలి కావాలి అంటే చెప్పుకొచ్చింది సోనియా. మణికంఠ, యష్మీ ఇద్దరు స్పై (గూఢచారి)లానే బిహేవ్ చేస్తారు అని నిఖిల్ తో చెప్పింది సోనియా. చివరకు నిఖిల్ టీంలో నలుగురు సభ్యులు ఉండగా.. సీత టీంలో ఐదుగురు సభ్యులు ఉండడంతో వారిని డ్రాగన్ ఫ్లై రూమ్ వాడుకోవాలని సూచించాడు బిగ్బాస్.
ఇక ఇన్నాళ్లు రేషన్ కట్.. కిచెన్ అంటూ రూల్స్ పెట్టిన బిగ్బాస్.. ఇప్పుడు కంటెస్టె్ంట్లకు ఊహించని షాకిచ్చాడు. ఈసారి హౌస్ లో పెద్ద భూకంపం, పెను తుఫాన్ రాబోతుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ తుఫాన్ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లొచ్చు… ఇప్పుడు మీకు రాబోయే సర్ ప్రైజ్ అన్నిటికంటే పెద్దది.. మొదటిసారి బిగ్బాస్ చరిత్రలోనే ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రెండు వారాల్లో రాబోతున్నాయి. ఇది లిమిట్ లెస్ అవకాశాల సీజన్.. మొదటిసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నారు. అందుకు మీరు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్ గెలవాలి. ప్రతి ఛాలెంజ్ కు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు.. మీరు అన్ని ఛాలెంజెస్ గెలిస్తే అన్ని తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి.. అలాగే ప్రతి ఛాలెంజ్ కు ఒక లక్ష రూపాయాలు గెలిచి మీ ప్రైజ్ మనీకి యాడ్ చేయగల్గుతారు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంత ఎక్కువ మంది వస్తే.. మీలో నుంచి అంత ఎక్కువ మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి రావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.
ముందుగా సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లో భాగంగా బాల్ ను పట్టు టవర్ లో పెట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. పది నిమిషాల సమయంలో ఐదు బాల్స్ ఓ స్టిక్స్ పై బ్యాలెన్స్ చేస్తూ టవర్లో వేయాలి. ముందుగా ఎవరు వేస్తే వాళ్లు విన్నర్.. రెండూ టీమ్స్ వేయలకేపోతే ఇద్దరూ ఓడిపోయినట్లే అని చెప్పాడు. ఈ టాస్కు కోసం కాంతార టీం నుంచి ఆదిత్య, ప్రేరణ, నబీల్, నైనిక ఆడగా.. శక్తి టీమ్ నుంచి అందరూ ఆడారు. ఈ టాస్కులో 9 నిమిషాల 46 సెకన్లలోనే ఐదు బాల్స్ వేసి గెలిచింది సీత టీం. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపడంతోపాటు ఫ్రైజ్ మనీకి రూ. లక్ష యాడ్ అయ్యింది. ఓడిపోయిన కారణంగా శక్తి టీం నుంచి ఒక సభ్యుడిని తొలగించాలని చెప్పడంతో అందరూ కలిసి మణికంఠను తప్పించారు. ఇక ఆ తర్వాత ఈట్ ఇట్ టూ బీట్ ఇట్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో రెండు టీమ్స్ మధ్య మహాథాలీ పెట్టి దానిని పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పాడు. 40 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన ఈ టాస్కు కోసం శక్తి టీమ్ నుంచి సోనియా, కాంతార టీమ్ నుంచి నబీల్ వచ్చారు. ఇద్దరూ ఆ థాలీని తినలేకపోయారు. ఆ తర్వాత యష్మీ, ఆదిత్య కూడా ఈ టాస్కులో పాల్గొన్నారు. కానీ 40 నిమిషాలు అయిపోయినా ఆ థాలీ మాత్రం పూర్తి కాలేదు. దీంతో ఆ టాస్కులో రెండు టీమ్స్ ఓడిపోయాయి. ఇక మిగిలిన ఫుడ్ అందరూ షేర్ చేసుకోవచ్చు అని చెప్పాడు బిగ్బాస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.