Anasuya Bharadwaj : మీరు అలా అర్థం చేసుకున్నారా ?.. సోషల్ మీడియా నెగిటివిటికి ఏడవలేదు.. మరో వీడియో షేర్ చేసిన అనసూయ..

రంగస్థలం సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్న అనసూయ... ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఓవైపు చేతినిండా సినిమాలు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుసూయ. ఫోటోషూట్స్ షేర్ చేయడమే కాదు.. అప్పుడప్పుడు అభిమానలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

Anasuya Bharadwaj : మీరు అలా అర్థం చేసుకున్నారా ?.. సోషల్ మీడియా నెగిటివిటికి ఏడవలేదు.. మరో వీడియో షేర్ చేసిన అనసూయ..
Anchor Anasuya

Updated on: Aug 19, 2023 | 8:15 PM

యాంకర్ అనసూయ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బుల్లితెరపై యాంకరింగ్ ద్వారా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తోంది. రంగస్థలం సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్న అనసూయ… ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఓవైపు చేతినిండా సినిమాలు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుసూయ. ఫోటోషూట్స్ షేర్ చేయడమే కాదు.. అప్పుడప్పుడు అభిమానలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం ఆమె షేర్ చేసిన ఓ వీడియో క్షణాల్లో వైరలవుతుంది. అందులో ఫుల్ గా ఏడుస్తూ కనిపించింది. అంతేకాకుండా.. ఓ పొడవాటి వ్యాసం కూడా రాసింది.

కానీ అందులో తాను ఎందుకు ఏడుస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివి, ట్రోలింగ్ గురించి ఏడ్చిందని అంతా అనుకున్నారు. నిజానికి అనసూయ రాసిన స్టోరీ క్షుణ్ణంగా చదివితే నెగిటివిటి గురించి అన్నట్టుగానే ఉందున్నారు నెటిజన్స్. దీంతో ఆమెకు మద్దతుగా కొందరు.. భిన్నంగా మరికొందరు కామెంట్స్ చేశారు. ఇక ఇదే విషయంపై క్లారిటీ ఇస్తూ తాజాగా మరో వీడియో షేర్ చేసింది అనసూయ.

ఇవి కూడా చదవండి

వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ..

అందరు అనుకున్నట్లుగా తాను సోషల్ మీడియా నెగిటివిటీ గురించి ఏడదలేని…అసలు తాను రాసిన పోస్ట్ చదవలేదా ? అంటూ ప్రశ్నించింది. ఆ వీడియో చేసిన తర్వాత తాను సంతోషంగా పార్లర్ కు వెళ్లి ఫేషియల్ చేసుకున్నానని.. తన జీవితంలో తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఆ వీడియో చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను నెట్టింట వచ్చే నెగిటివిటి గురించి భయపడని.. దానివల్ల తనపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పుకొచ్చింది. అలాగే తనకు సింపతి అనేది అస్సలు నచ్చదని..ఎప్పుడు బ్రేక్ డౌన్ అయ్యే మనిషి కాదని.. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటి తాను ఏడవేనని.. ఆ విషయాన్ని తాను కోపంతో ఆన్సర్ ఇస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన మరో వీడియో నెట్టింట వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

క్లారిటీ ఇచ్చిన అనసూయ.. 

ఇటీవల కొద్ది రోజుల క్రితం అనసూయ తన భర్త, పిల్లలతో కలిసి వేకేషన్ వెళ్లింది. అక్కడ తన ఫ్యామిలీతో సరదీగీ గడిపిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేయగా.. కొందరు ట్రోల్స్ చేశారు. ఇక అంతకు ముందు పలుమార్లు అనసూయ పై నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనపై వచ్చే ట్రోలింగ్, కామెంట్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యింది అనసూయ.

అనసూయ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.