Ananya Nagalla: వామ్మో.. అనన్యలో ఈ టాలెంట్ ఉందా..? కర్రసాము అదరగొట్టేస్తోన్న తెలుగమ్మాయి.. వీడియో వైరల్..
కానీ హీరోయిన్ ఆఫర్స్ కోసమే వెయిట్ చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అనన్య. ఇటీవలే తంత్ర మూవీతో మరో విజయాన్ని అందుకుంది. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అనన్య నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనన్య.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల కొన్నాళ్లుగా గ్లామర్ ఫిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పుడిప్పుడే వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తున్నారు. బేబీ సినిమాతో హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమాతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రశంసలు అందుకుంది. కానీ హీరోయిన్ ఆఫర్స్ కోసమే వెయిట్ చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అనన్య. ఇటీవలే తంత్ర మూవీతో మరో విజయాన్ని అందుకుంది. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అనన్య నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనన్య.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల కొన్నాళ్లుగా గ్లామర్ ఫిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. తాజాగా నెట్టింట అనన్య షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతుంది.
అందులో అనన్య మరో టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఈ బ్యూటీకి ఆ స్పెషల్ టాలెంట్ ఏంటీ అనుకుంటున్నారా .. ? తెలుగమ్మాయి కర్రసాము అదరగొట్టేస్తుంది. ఊళ్లలో కర్రసాము చేసేవిధంగానే ఓ రేంజ్ లో చేస్తూ కనిపించింది అనన్య.. అయితే ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో కర్రసాము ప్రాక్టీస్ వీడియో అని తెలుస్తోంది. అనన్య షేర్ చేసిన వీడియో చూస్తుంటే ఏదో సినిమా కోసమే ఆమె కర్రసాము నేర్చుకుంటుందేమో అని అంటున్నారు నెటిజన్స్. అటు నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్న అనన్య.. ఇప్పుడు కర్రసాము కూడా బాగానే చేస్తుందంటున్నారు. ప్రస్తుతం అనన్య షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేకముందు ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది అనన్య. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ క్యా్స్టింగ్ కౌచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాను ఇంకా ప్రేమలో పడలేదని.. లవ్ చేసేందుకు సెర్చింగ్ లో ఉన్నానని.. హానెస్ట్ గా ఉండే అబ్బాయి కోసం వెతుకుతున్నానని.. కానీ ఇప్పటివరకు అలాంటి వ్యక్తి దొరకలేదని తెలిపింది. అలాగే ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో ప్రేమ అంటే కష్టమని.. వాళ్లకు చాలా ఆప్షన్స్ ఉంటాయని తెలిపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.