Pushpa 2: పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ.. అల్లు అర్జున్ సరసన యానిమల్ హీరోయిన్..
ఇక ఇప్పుడు పుష్ప 2 మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పుష్ప సినిమాను మించి మ్యూజిక్ ఉంటుందని.. మరోసారి మాస్ మ్యూజిక్‌తో దేవి శ్రీ ప్రసాద్ అదరగొట్టేందుకు రెడీ అయ్యాడని అంటున్నారు. అలాగే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం నడుస్తుంది. ఈ సాంగ్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన తారల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో పుష్ప ఒకటి. అంతేకాకుండా థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక పుష్ప సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలోని సాంగ్స్ హైప్ క్రియేట్ చేశాయి. శ్రీవల్లీ, నా సామిరంగ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఊ అంటావా మావా ఊహు అంటావా’ అనే స్పెషల్ సాంగ్ విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది. ‘పుష్ప’ సినిమా హిట్ కావడానికి ఈ సాంగ్ కూడా ఒక కారణం. అప్పట్లో ఈ సాంగ్ ఓ రేంజ్ సంచనంగా మారింది. ఇక ఇప్పుడు పుష్ప 2 మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పుష్ప సినిమాను మించి మ్యూజిక్ ఉంటుందని.. మరోసారి మాస్ మ్యూజిక్‌తో దేవి శ్రీ ప్రసాద్ అదరగొట్టేందుకు రెడీ అయ్యాడని అంటున్నారు. అలాగే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం నడుస్తుంది. ఈ సాంగ్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన తారల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.
పుష్ప 2లో బీటౌన్ నేషనల్ క్రష్ త్రిప్తీ దిమ్రీ నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ హీరోయిన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో త్రిప్తి సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాతో త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. యానిమల్ సినిమాతో అందం, అభినయంతో మెప్పించిన త్రిప్తితో సినిమా చేసేందుకు మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప 2 ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ త్రిప్తి స్పెషల్ సాంగ్ చేయనుందని అంటున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చాలా ప్రత్యేకత ఉంటుందని.. ఇందులో బన్నీ, త్రిప్తి జోడిగా మంచి రెస్పాన్స్ రానుందని అంటున్నారు. బన్నీ సూపర్ డ్యాన్సర్.. ఇక త్రిప్తి గ్లామర్ క్వీన్. వీరిద్దరి జోడీ ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు.
యానిమల్ సినిమాలో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్. కానీ కీలకపాత్రలో కనిపించిన త్రిప్తికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం బ్యాడ్ బాయ్జ్, భూల్ భూలయ్య 2, విక్కీ విద్యా కా ఓవాలా వీడియో చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో ‘బ్యాడ్ బాయ్జ్’ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.