Highway Movie: ఆనంద్ దేవ‌ర‌కొండ న్యూమూవీ అప్డేట్.. ఆకట్టుకుంటున్న హైవే పోస్టర్స్..

Highway Movie: ఆనంద్ దేవ‌ర‌కొండ న్యూమూవీ అప్డేట్.. ఆకట్టుకుంటున్న హైవే పోస్టర్స్..
Highway

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల పుష్పక విమానం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న

Rajitha Chanti

|

Dec 02, 2021 | 8:53 PM

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల పుష్పక విమానం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆనంద్.. వరుస చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హైవే. సైకో క్రైమ్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న “హైవే” సినిమాకు కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.

ఇక ఆనంద్ సరసన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్పణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బ్యానర్ పై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్రలో న‌టిస్తోంది.

భారీ అంఛ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలంగాణ‌, ఆంధ్ర ప్రదేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు తుది ద‌శ‌లో ఉన్నాయి. మూవీ ప్రమోష‌న్ కార్యక్రమాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్టర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఒక‌రితో ఒక‌రికి సంభంధం లేని న‌లుగురు వ్యక్తుల క‌థే హైవే అని.. పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ అని. టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుంది అన్నారు డైరెక్టర్ కేవి గుహన్.

ట్వీట్..

Also Read: Sirivennela Seetharama Sastri: మా బాధ్యతను పెంచింది.. మీరు చూపించిన ప్రేమను మర్చిపోలేం.. సిరివెన్నెల కుటుంబం ..

Bigg Boss 5 Telugu: ఫినాలే రేస్‏లో గాయపడి బెడ్‏కే పరిమితమైన శ్రీరామచంద్ర.. ప్రియ కామెంట్స్ వైరల్..

Samantha: బాలీవుడ్‏లో పాగా వేయనున్న సమంత.. మరో మూడు ప్రాజెక్టులకు సామ్ గ్రీన్ సిగ్నల్ ?..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu