AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: నవ మన్మథుడు బర్త్ డే స్పెషల్.. నాగ్ 100వ సినిమా గ్లింప్స్ వచ్చేసింది

టాలీవుడ్ కింగ్ నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్రహీరోలతో పోటీ పడుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కేవలం హీరోగానే కాదు ఇటీవల రూట్ మార్చి సహాయక పాత్రల్లో అలాగే విలన్ గానూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. నేడు కింగ్ నాగార్జున పుట్టిన రోజు నేడు..

Nagarjuna: నవ మన్మథుడు బర్త్ డే స్పెషల్.. నాగ్ 100వ సినిమా గ్లింప్స్ వచ్చేసింది
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 11:25 AM

Share

టాలీవుడ్ కింగ్, నవ మన్మథుడు, ఎవర్ గ్రీన్ హీరో నాగార్జున పుట్టిన రోజు నేడు. నేటితో 68వ వసంతంలోకి అడుగుపెట్టారు నాగ్. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా విక్రమ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రేమకథా చిత్రాలకు నాగ్ కేరాఫ్ అడ్రస్. అలాగే ఇటు భక్తిరస చిత్రాలు అంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత గుర్తొచ్చే పేరు నాగార్జున. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీరంగంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు నాగార్జున. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. ఇటు భక్తిగీతాలు ఆలపించడం ఆయనకే సాధ్యం. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్య పాత్రలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించారు నాగార్జున. అమ్మాయిల కలల రాకుమారుడిగా క్లాస్ చిత్రాలతో సందడి చేసిన నాగ్.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ సినిమాతో మాస్ హీరోగానూ రచ్చ చేశారు.

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే

అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్యగా.. శ్రీరామదాసుగా, షిరిడీ సాయిగా మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. నాగార్జున మొదటి చిత్రం విక్రమ్.. 1986 మే 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. నాగ్ కెరీర్‏లో ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, హలో బ్రదర్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున విజయవంతంగా 99 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పుడు 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇవి కూడా చదవండి

ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు

నాగార్జున 100వ సినిమాకు లాటరీ కింగ్ అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా  నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నాగ్ 100వ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు అక్కినేని అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో నాగ్ మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమాలో అఖిల్, నాగ చైతన్య గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

అన్నపూర్ణ స్టూడియో ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us