AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’ ప్రభాస్..8 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం 70 కోట్లు!

టాలీవుడ్ ‘బాహుబలి’ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ‘సాహో’. ఈ భారీ యాక్షన్ మూవీ ఆగష్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ రూపొందిస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్నటితో షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వడంతో.. తాజాగా సాహో సినిమాకు సంబంధించిన  షాకింగ్ న్యూస్‌లు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అవేంటంటే.. […]

'సాహో' ప్రభాస్..8 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం 70 కోట్లు!
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2019 | 5:00 PM

Share

టాలీవుడ్ ‘బాహుబలి’ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ‘సాహో’. ఈ భారీ యాక్షన్ మూవీ ఆగష్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ రూపొందిస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్నటితో షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వడంతో.. తాజాగా సాహో సినిమాకు సంబంధించిన  షాకింగ్ న్యూస్‌లు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

అవేంటంటే.. ఇందులో 8 నిమిషాల పాటు ఉత్కంఠతను కలిగించే ఫైట్ సీన్ సినిమాలో ఉందని మూవీ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం. అలాగే.. ఆ సన్నివేశాన్ని దుబాయ్ లో షూట్ చేశారట. అంతేకాకుండా దీనికోసం ఏకంగా రూ. 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఒక ఫైట్ సీన్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం అంటే మాములు విషయం కాదు.  ఈ ఫైట్ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ గా నిలుస్తోందని సమాచారం. దీంతో పాటు సాహోలో మొత్తం యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా 120కార్లను వాడారట. కేవలం ఛేజింగ్ సీక్వెన్స్‌లోనే 56కార్లను వాడారట. సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ సీన్ల కోసం ఈ రేంజ్‌లో కార్లను వాడుతుంటారు. కానీ ఒక ఇండియన్ సినిమాలో ఇలా వాడటం.. ఇదో రికార్డే అని చెప్పుకోవాలి. మరి ఇంత భారీ బడ్జెట్‌తో కార్లను వాడారంటే ఆ సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. బాలీవుడ్ నటులు ఇవ్లిన్‌ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్ ముఖేష్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలతో పాటు మహేష్ మంజ్రేకర్‌, అరుణ్ విజయ్‌, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!