AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇస్మార్ట్ పోరడు..’A’ సర్టిఫికేట్‌తో వస్తుండు!

పూరీ జ‌గ‌న్నాథ్..ఈ నేమ్‌కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైంలో సినిమా తియ్యడం..హీరోకి ఎంత స్టార్ డమ్‌ ఉన్నా పక్కనపెట్టి తన పంథాలో సపరేట్ మేనరిజమ్ క్రియేట్ చెయ్యడం పూరి స్టైల్. అందుకే ఇండస్ట్రీలో అందరూ పూరీ సినిమాలు ఫ్లాపు అవ్వొచ్చేమో గాని పూరి మాత్రం ఫెయిల్ అవ్వడు అంటారు. తాజాగా ఆయన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే మూవీని టైటిల్ తెరకెక్కించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోస్, పాట‌లు, ట్రైల‌ర్ […]

ఇస్మార్ట్ పోరడు..'A' సర్టిఫికేట్‌తో వస్తుండు!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 16, 2019 | 10:27 AM

Share

పూరీ జ‌గ‌న్నాథ్..ఈ నేమ్‌కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైంలో సినిమా తియ్యడం..హీరోకి ఎంత స్టార్ డమ్‌ ఉన్నా పక్కనపెట్టి తన పంథాలో సపరేట్ మేనరిజమ్ క్రియేట్ చెయ్యడం పూరి స్టైల్. అందుకే ఇండస్ట్రీలో అందరూ పూరీ సినిమాలు ఫ్లాపు అవ్వొచ్చేమో గాని పూరి మాత్రం ఫెయిల్ అవ్వడు అంటారు.

తాజాగా ఆయన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే మూవీని టైటిల్ తెరకెక్కించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోస్, పాట‌లు, ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్స్‌. మణిశర్మ బాణీలు అందించారు. ఈనెల 18న చిత్రం విడుదల కాబోతోంది.  ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సెన్సార్ పూర్త‌యింది. దీనికి ‘ A’  స‌ర్టిఫికేట్ ఇచ్చారు.

సాధార‌ణంగా త‌న సినిమాకు ‘ A’ స‌ర్టిఫికేట్ వ‌స్తే ద‌ర్శ‌క నిర్మాత‌లు కంగారు ప‌డ‌తారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ రారేమో అని టెన్ష‌న్ ప‌డ‌తారు. కానీ పూరీ మాత్రం ఫుల్ హ్యపీ అవుతున్నాడు. ఎందుకంటే ఈయ‌న పూర్తిగా ‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమాను ‘ A’ స‌ర్టిఫికేట్ ప్రేక్ష‌కుల కోస‌మే తీసాడు. ఈ విష‌య ట్రైల‌ర్ చూడ‌గానే అర్థ‌మైపోయింది. ఈ చిత్రంతో క‌చ్చితంగా హిట్ కొడ‌తామని పూరి అండ్ టీం బలంగా నమ్ముతోంది. దీనికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన పోకిరి.. అల్లు అర్జున్  దేశ‌ముదురు.. మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్ కూడా అప్ప‌ట్లో ‘ A’ స‌ర్టిఫికేట్ తెచ్చుకున్నాయి. ఈ మూడు సినిమాలు మంచి విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకు కూడా ‘ A’ వ‌చ్చింది. మ‌రి వాళ్ల న‌మ్మ‌కాన్ని ఇస్మార్ట్ శంక‌ర్ ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాడో..లెట్స్ వెయిట్ అండ్ సీ.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!