వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్: ఇంకా మైండ్‌ను విడవట్లా- మహేశ్

ప్రపంచ క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా..భవిష్యత్‌లో ఇలాంటి మ్యాచ్ జరుగుతుందా? అన్న సదేహం కలిగేలా.. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కివీస్, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఎక్కడా పట్టు విడవలేదు. ప్రపంచ కప్‌ను ముద్దాడటం కోసం తమ అస్త్ర, శస్త్రాలు అన్నింటిని ఉపయోగించాయి. సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ రావడం..అది కూడా టై అవడంతో.. చివరకు ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం […]

వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్: ఇంకా మైండ్‌ను విడవట్లా- మహేశ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 16, 2019 | 7:28 AM

ప్రపంచ క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా..భవిష్యత్‌లో ఇలాంటి మ్యాచ్ జరుగుతుందా? అన్న సదేహం కలిగేలా.. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కివీస్, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఎక్కడా పట్టు విడవలేదు. ప్రపంచ కప్‌ను ముద్దాడటం కోసం తమ అస్త్ర, శస్త్రాలు అన్నింటిని ఉపయోగించాయి. సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ రావడం..అది కూడా టై అవడంతో.. చివరకు ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు రుచించడం లేదు. పలువురు మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు ఐసీసీ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

కానీ అత్యద్భుమైన క్రికెట్ మ్యాచ్ చూశామనే భావన మాత్రం అందరిలో ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ఎందరో ఈ వరల్డ్ కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్ ప్రదర్శనను పొగుడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా వరల్డ్ కప్ ఫైనల్‌పై స్పందించారు.

‘‘ఇప్పటికీ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మైకంలోనే ఉన్నా.. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ మాత్రం తప్పకుండా హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు’’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.