“బిగ్‌బాస్” షో పై గాయత్రీ గుప్తా షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ సీజన్ 3 ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా బిగ్‌బాస్‌పై ఒక రేంజ్‌లో మండిపడుతోంది నటి గాయత్రీ గుప్తా. క్యాస్టింగ్ కౌచ్ అక్కడకూడా ఉందని వ్యాఖ్యానించి తీవ్ర దుమారం రేపింది ఈ నటి. గత ఏడాది బిగ్‌బాస్ సీజన్ 2లో తనకు అవకాశం వచ్చిందని, అయితే అక్కడ ఛాన్స్ కోసం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాల ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి విసిగించారంటూ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే అందులో పార్టిసిపేట్ […]
బిగ్‌బాస్ సీజన్ 3 ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా బిగ్‌బాస్‌పై ఒక రేంజ్‌లో మండిపడుతోంది నటి గాయత్రీ గుప్తా. క్యాస్టింగ్ కౌచ్ అక్కడకూడా ఉందని వ్యాఖ్యానించి తీవ్ర దుమారం రేపింది ఈ నటి. గత ఏడాది బిగ్‌బాస్ సీజన్ 2లో తనకు అవకాశం వచ్చిందని, అయితే అక్కడ ఛాన్స్ కోసం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాల ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి విసిగించారంటూ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే అందులో పార్టిసిపేట్ చేయకుండా తప్పుకున్నానని చెప్పింది. పైగా అందులోకి వెళ్లకపోవడమే మంచిదని .. అక్కడికి వెళ్లి వచ్చిన తన ఫ్రెండ్స్ చెప్పారంది ఈ హాట్ బ్యూటీ. మరి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న బిగ్‌బాస్‌పై గాయత్రీ చేస్తున్న వాదనల్లో నిజమెంతో తెలియదు గానీ ఆమె కామెంట్స్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.