
Allu Arjun’s Pushpa: ఇటీవలే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం బన్నీ అభిమానులతో పాటు సినీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. ఇక బన్నీ లుక్ కూడా ఊర మాస్ గా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ ను క్రియేట్ చేసాయి. రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పుష్ప పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తుంది. గిరిజన యువతి పాత్రలో ఈ అమ్మడు కనిపించనుందని టాక్. అలాగే అనసూయ కూడా పుష్పలో కీలక పాత్రలో నటించనుందట.
పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో అంటూ ఇటీవల ఓ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుదలైన కొద్దీ గంటల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. విడుదలైన 20 రోజుల్లో 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి టాలీవుడ్ లోనే ఫాస్ట్ 50మిలియన్స్ బ్రేక్ చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :