AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: రికార్డుల మోత షురూ.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న పుష్ఫ 2 టీజర్‌.. బన్నీ మాస్‌ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా

అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పుష్ప2 అప్డేట్ ఎట్టకేలకు నిన్న (ఏప్రిల్‌ 7) వచ్చింది. బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకుని పుష్ఫ2 ది రూల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 'వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్' అంటూ విడుదలైన ఈ గ్లింప్స్‌ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Pushpa 2: రికార్డుల మోత షురూ.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న పుష్ఫ 2 టీజర్‌.. బన్నీ మాస్‌ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా
Allu Arjun
Basha Shek
|

Updated on: May 29, 2023 | 8:07 PM

Share

అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పుష్ప2 అప్డేట్ ఎట్టకేలకు నిన్న (ఏప్రిల్‌ 7) వచ్చింది. బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకుని పుష్ఫ2 ది రూల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్‌ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ బన్నీ వీడియో యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటివరకు పుష్ప2 టీజర్‌కు 18 మిలియన్ల వ్యూస్‌ రావడం విశేషం. ఇక దీనిని మించి హిందీ టీజర్‌కు ఏకంగా 20 మిలియన్ల వ్యూస్‌ రావడం మరో విశేషం.మొత్తానికి యూట్యూబ్‌లో రికార్డుల మోత షురు చేశాడు అల్లు అర్జున్‌. కాగా ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించాడు. ఎనిమిది బుల్లెట్ల తగిలి శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ ఉత్కంఠను క్రియేట్ చేశారు మేకర్స్‌. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్‌ పాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ పుష్ఫ2 సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా బన్నీ బర్త్‌డే సందర్భంగా టీజర్‌తో పాటు రిలీజైన మరొక ఫొటో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. పట్టు చీర కట్టుకుని, ముక్కుపుడక, బుట్ట కమ్మలు, చేతికి ఎర్ర రంగు గాజులు, మెడలో బంగారు గొలుసు, నిమ్మకాలయ దండతో, ఎంతో గంభీరంగా గంగమ్మ రూపంలో ఉన్న బన్నీ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోను స్వయంగా అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్