Allu Arjun: స్టైలీష్ స్టార్ మరీ.. స్పెషల్‏గా ఉండాల్సిందే.. ఆర్య ఈవెంట్లో బన్నీ ధరించిన షూస్ ధరెంతో తెలుసా ?..

పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు బన్నీ నెక్ట్స్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు బన్నీ. కానీ తన కెరీర్ మలుపు తిప్పిన సినిమా మాత్రం ఆర్య. డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన మూవీ ఇది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. బన్నీ కెరీర్ లో ఈ సినిమా చాలా స్పెషల్.

Allu Arjun: స్టైలీష్ స్టార్ మరీ.. స్పెషల్‏గా ఉండాల్సిందే.. ఆర్య ఈవెంట్లో బన్నీ ధరించిన షూస్ ధరెంతో తెలుసా ?..
Allu Arun New
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2024 | 6:33 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలీష్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. యాక్టింగ్.. డ్రెస్సింగ్.. డాన్స్.. మ్యానరిజం ఇలా ప్రతి విషయంలో బన్నీ స్టైల్ వేరే. గంగోత్రి సినిమాతో హీరోగా మొదలైన సినీ ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‏గా కొనసాగుతుంది. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు బన్నీ నెక్ట్స్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు బన్నీ. కానీ తన కెరీర్ మలుపు తిప్పిన సినిమా మాత్రం ఆర్య. డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన మూవీ ఇది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. బన్నీ కెరీర్ లో ఈ సినిమా చాలా స్పెషల్.

ఇటీవలే ఈ మూవీ 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో ఆర్య 20 ఇయర్స్ సెలబ్రెషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈవేడుకకు ఆర్య చిత్రయూనిట్, సినీ ప్రముఖులు, నిర్మాతలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో బన్నీ మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. బ్లాక్ షర్ట్, జీన్స్ ధరించి స్టైలీష్ లుక్‏లో కనిపించాడు. ఇక అదే సమయంలో బన్నీ ధరించిన ప్రాడా షూస్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆ షూస్ ధర తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు బన్నీ షూస్ ధర గురించి సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ అనే ఇన్ స్టా పేజీ వెల్లడించింది. ఆ ఇన్ స్టా పేజీ ప్రకారం బన్నీ ధరించిన ప్రాడా షూస్ ధర రూ.86,020 ఉంటుందట. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లలో కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.