Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన మైనపు విగ్రహం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమా విడుదలయ్యాక బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇదే పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమా విడుదలయ్యాక బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇదే పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. దుబాయ్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ మైనపు విగ్రహం కొలువు దీరింది. అల్లు అర్జున్ స్వయంగా దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లి తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ ఐకానిక్ స్టైల్ తరహాలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి విగ్రహం వెనక ఫొటో మాత్రమే బయటకు వచ్చింది. . ఫ్రంట్ ఫోటో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహ ఆవిష్కరణ. ప్రతి కళాకారుడి జీవితంలో ఇది ఒక మైలురాయి. అద్భుత క్షణం. ‘ధన్యవాదాలు’ అంటూ తన మైనపు విగ్రహం ఫొటోను షేర్ చేశాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖులు, బంధువులు బన్నీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటుచేయడంతో దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు సందర్శకుల సంఖ్య పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
వివిధ రంగాలలో అసమానమైన విజయాలు సాధించిన విశిష్ట వ్యక్తుల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్ఠిస్తారు. సినీ పరిశ్రమలో విజయాలు సాధించిన పలువురు ప్రముఖులను ఈ విధంగా సత్కరించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరాడు. అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ పనుల్లో నిమగ్నమయ్యాడు. మధ్యమధ్యలో విరామం తీసుకుని దుబాయ్ వెళ్లాడు. బన్నీ వెంట భార్య అల్లు స్నేహా రెడ్డి, కుమార్తె అల్లు అర్హ, కుమారుడు అల్లు అయాన్ కూడా ఉన్నారు.
అల్లు అర్జున్ ట్వీట్..
Excited & Grateful 🖤 pic.twitter.com/fcdcE71dJf
— Allu Arjun (@alluarjun) March 28, 2024
అభిమానుల ఫుల్ ఖుష్..
Allu Arjun Wax Statue – Madame Tussauds 🔥
2 days to go 🦁🔥🔥@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/Oh7MYGKUko
— TotallyAlluArjun (@TeamTAFC) March 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.