Sandeep Reddy Vanga: నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా

హిందీలో కబీర్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కించి మరో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా యానిమల్ సినిమాతో మరో భారీ హిట్ అందుకున్నాడు. దాంతో సందీప్ కు డిమాండ్ పెరిగింది. ఆయనతో సినిమా కోసం వందల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కొత్త చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్నారు.

Sandeep Reddy Vanga: నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
Sandeep Reddy Vanga
Follow us
Rajeev Rayala

| Edited By: TV9 Telugu

Updated on: May 11, 2024 | 3:40 PM

చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి. విజయ్ దేవర కొండా హీరోగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కించి మరో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా యానిమల్ సినిమాతో మరో భారీ హిట్ అందుకున్నాడు. దాంతో సందీప్ కు డిమాండ్ పెరిగింది. ఆయనతో సినిమా కోసం వందల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కొత్త చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్నారు. స్పిరిట్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సందీప్. అయితే ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈలోగా సందీప్ మరో సినిమా చేయాలనీ ఆలోచిస్తున్నారట.

అయితే దర్శకుడిగా కాకుండా ఈసారి నిర్మాతగా మారనున్నాడు సందీప్. సందీప్ రెడ్డి వంగ తక్కువ బడ్జెట్ సినిమాలను నిర్మించాలని చూస్తున్నాడట.  కొత్త టాలెంట్‌కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఆయన టీమ్ ఇప్పుడు స్క్రిప్ట్‌ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది. ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు సందీప్. రెండేళ్లపాటు ఈ కొత్త కార్యాలయంలో కొత్త సినిమాల పై కసరత్తులు చేయనున్నారు.

సందీప్ రెడ్డి వంగా ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఈ మూడు సినిమాలు విమర్శలు ఎదుర్కొన్నాయి. సినిమాలో మహిళా వ్యతిరేక డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని పలువురు విమర్శించారు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం అలాంటి విమర్శలను పట్టించుకోలేదు. పైగా మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా ఇప్పుడు ‘స్పిరిట్’ ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల సందీప్ రెడ్డి వంగ తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. తర్వాత ‘స్పిరిట్’ గురించి మాట్లాడాడు. ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

సందీప్ రెడ్డి వంగ ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.