S. S. Rajamouli: ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..! ఈ వీడియో చూస్తే రాజమౌళి సెల్యూట్ చెయ్యాల్సిందే
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన రాజమౌళి తన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
దర్శక ధీరుడు రాజామౌళి పేరు తెలియని వారు ఉండరు. బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ గా .. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన రాజమౌళి తన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ఈగ సినిమా ఒకటి. ఈగ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. హీరో లేకుండా కేవలం ఈగ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు జక్కన .
రాజమౌళి సినిమాల కు ముందు నటీనటులతో వర్క్ షాప్ నిర్వహిస్తారు. ఆయన మైండ్ లో ఉన్న పాత్రలకు నటీ నటులు ఎలా సెట్ అవుతారో ఆయన వర్క్ షాప్ చేసి వారికి ట్రైనింగ్ ఇస్తారు. తాజాగా ఈగ సినిమాలో హీరో నాని, సమంతకు ఆయన వర్క్ షాప్ నిర్వహించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో నాని, సమంతకు సీన్ ఎక్స్ ప్లైన్ చేస్తూ కనిపించారు జక్కన్న.
ఈ వీడియోలో రాజమౌళి ఈగ సినిమాలోని సాంగ్ ను వివరిస్తున్నారు. హీరో హీరోయిన్ ఎలా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలి.. ఎలా నటించాలి అన్ని వివరిస్తున్నారు రాజమౌళి. ఆయన చెప్పినట్టుకగా నాని, సమంత ఇద్దరూ నటించి చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఊరికే గ్రేట్ డైరెక్టర్స్ అవ్వరు మరి అంటున్నారు నెటిజన్స్. అలాగే రాజమౌళితో మాములుగా ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ కాబోతుందని ఇన్ సైడ్ టాక్. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.