AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు కలిసిపోయారు..

ఇటీవలే వెంకటేష్ నటించిన సైందవ్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే నవాజుద్దీన్ తన వ్యక్తిగత విషయాల కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలిచారు. నవాజుద్దీన్ కుటుంబంలో కలకలం  రేగిన విషయం తెలిసిందే . అతని భార్య అలియా సిద్ధిఖీ నవాజుద్దీన్ పై  పెద్దెత్తున ఆరోపణలు చేసింది. వరకట్నం కోసం వేధించారని కూడా ఆలియా ఆరోపించింది.

సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు కలిసిపోయారు..
Nawazuddin Siddiqui
Rajeev Rayala
|

Updated on: Mar 28, 2024 | 7:17 PM

Share

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన వైవిధ్యమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నవాజుద్దీన్. ఇటీవలే వెంకటేష్ నటించిన సైందవ్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే నవాజుద్దీన్ తన వ్యక్తిగత విషయాల కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలిచారు. నవాజుద్దీన్ కుటుంబంలో కలకలం  రేగిన విషయం తెలిసిందే . అతని భార్య అలియా సిద్ధిఖీ నవాజుద్దీన్ పై  పెద్దెత్తున ఆరోపణలు చేసింది. వరకట్నం కోసం వేధించారని కూడా ఆలియా ఆరోపించింది. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది.

అయితే ఇప్పుడు ఆమె తన భర్తతో కలిసిపోయింది. తమ మధ్య ఉన్న మనస్పర్థలు అన్నీ మరచిపోయి వివాహ వార్షికోత్సవాన్ని కలిసి జరుపుకున్నారు ఈ జంట.. ఇంతకీ ఆలియా సిద్దిఖీ ఇలా మనసు మార్చుకోవడానికి కారణం ఏంటి.? అని నెటిజన్స్ ఆలోచిస్తున్నారు. ఇందుకు కారణం పిల్లలు అని తెలుస్తోంది. అవును, పిల్లల కోసం ఆమె నవాజుద్దీన్ సిద్ధిఖీని మళ్లీ కలవడానికి అంగీకరించిందట ఆలియా.

కొద్ది రోజుల క్రితం అలియా సిద్ధిఖీ, నవాజుద్దీన్ సిద్ధిఖీ కలిసి ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. ఇంతకాలం గొడవపడి కుటుంబ కలహాలు వార్తల్లో నిలిచి ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యారని అంటున్నారు నెటిజన్స్. దీనిపై అలియా సిద్ధిఖీ ఇప్పుడు ఓ మీడియాతో స్పందించింది.

‘మూడో వ్యక్తి వల్ల మనకెప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇప్పుడు మన జీవితంలో అపార్థం లేదు. మేము మా పిల్లల కొరకు పూర్తిగా మారిపోయాము. ఇప్పుడు జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు. నవాజ్ తన కూతురు షోరాకు చాలా క్లోజ్. మా మధ్య గొడవ జరిగినప్పుడు ఆమె చాలా డిస్టర్బ్ అయింది. అదంతా ఆమె భరించలేకపోయింది. కాబట్టి శాంతియుతంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం’ అని అలియా సిద్ధిఖీ తెలిపింది.

బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. భార్య చేసిన ఆరోపణలతో అతని కొంతమందిలో నెగిటివిటి ఏర్పడింది. మమ్మల్ని ఇంటి నుంచి గెంటేశారని ఆలియా గతంలో ఆరోపించింది. వీరి గొడవ విడాకుల వరకు వెయ్యాలి. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలసి ఉండటంతో అభిమానులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలియా, నవాజుద్దీన్‌ల వివాహమై 14 ఏళ్లు అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే