Pushpa 2: ‘తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు’.. పుష్ప2 రిలీజ్ ముంగిట అల్లు అర్జున్ పోస్ట్

|

Dec 03, 2024 | 7:18 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం (డిసెంబర్ 04) రాత్రే ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడనున్నాయి. కాగా తన సినిమా రిలీజ్ కు ముందు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్.

Pushpa 2: తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.. పుష్ప2 రిలీజ్ ముంగిట అల్లు అర్జున్ పోస్ట్
CM Revanth Reddy, Allu Arjun
Follow us on

పుష్ప-2 సినిమా రిలీజ్ ముంగిట తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు బన్నీ.. ‘సినిమా ఇండస్ట్రీకి మీరు ఇస్తున్న సపోర్ట్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పుష్ప-2 టికెట్స్‌ పెంచుకునేందుకు జీవో ఇవ్వడం లాంటి మీ ఆలోచనాత్మక నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది’ అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు తెలంగాణ సీఎంవో, సీఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని ట్యాగ్ చేశారు. కాగా పుష్ప-2 సినిమాకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోలకు గరిష్ఠంగా రూ.800 పెంచుకునేందుకు రేవంత్ సర్కారు పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ కు అదనంగా రూ.800 వరకు పెంచుకోవచ్చు. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతించింది.

ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకోవచ్చని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు అల్లు అర్జున్.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ట్వీట్..

ఏపీ ప్రభుత్వానికి కూడా..

అంతకు ముందు పుష్ప 2 సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తూ జీవో ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ధన్యవాలు తెలిపాడు అల్లు అర్జున్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.