Pushpa 2: మీ డెడికేషన్‌కు సెల్యూట్.. పుష్ప 2 మేకింగ్ వీడియో చూస్తే మీరు ఇదే అంటారు

|

Dec 04, 2024 | 8:12 AM

డిసెంబర్ 5న పుష్ప2 గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈగర్ గా ఎదుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్

Pushpa 2: మీ డెడికేషన్‌కు సెల్యూట్.. పుష్ప 2 మేకింగ్ వీడియో చూస్తే మీరు ఇదే అంటారు
Allu Arjun Pushpa 2 Movie
Follow us on

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప: ది రైజ్ అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్, సునీల్ ప్రధాన తారాగణంగా సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అల్లు అర్జున్ పాత్ర పుష్ప కూలీగా జీవితాన్ని ప్రారంభించి స్మగ్లింగ్ ముఠాకు నాయకుడిగా ఎలాఎదిగాడు అనేది చూపించారు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన, మ్యానరిజమ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి :Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్

పుష్ప 1 సినిమా సంచలన విజయం సాధించింది. అంతే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. పుష్ప 2 చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. తర్వాత విడుదల తేదీని డిసెంబర్‌కి వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా, చిత్ర బృందం గత నెల 17న ట్రైలర్‌ను విడుదల చేసింది. మొదటి భాగంలో కూలీగా కనిపించిన అల్లు అర్జున్ రెండో భాగంలో పెద్ద స్మగ్లింగ్ కింగ్‌పిన్‌గా కనిపించాడు. అదిరిపోయే విజువల్స్‌తో విడుదలైంది. ఇక సినిమా దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప 2 మూవీ షూటింగ్ వీడియోను విడుదల చేశారు. పుష్ప 2 మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :Nargis fakhri : మాజీ బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేసిన స్టార్ హీరోయిన్ సోదరి.. అరెస్ట్ చేసిన పోలీసులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.