Tollywood : 2024లో రీ సౌండ్ మాములుగా ఉండదు మరి.. ఫ్యాన్స్‌కు పూనకాలే
ఇప్పుడు తారక్, బన్నీ, చరణ్ చెప్పే మెయిన్ రీజన్ కూడా అదే. 2024 తెలుగు ఇండస్ట్రీకి కీలకంగా మారబోతుంది. ఎందుకంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్.. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్, తారక్ నటిస్తున్న సినిమాలు వచ్చేది వచ్చే ఏడాదే కాబట్టి. ఈ ముగ్గురు హీరోల నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి.. వాటన్నింటి బిజినెస్ లెక్కేస్తే 1500 కోట్లు దాటిపోతుందంటే వాళ్ళ రేంజ్ అర్థం అయిపోతుంది.
పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చిన తర్వాత ఇదివరకటి మాదిరి ఏడాదికి ఓ సినిమా చేయడానికి మన హీరోలు ఇష్టపడటం లేదు. అన్ని ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకుని కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ మాత్రం ఆలస్యమవుతుంది అని అభిమానులకు సర్ది చెప్తున్నారు. ఇప్పుడు తారక్, బన్నీ, చరణ్ చెప్పే మెయిన్ రీజన్ కూడా అదే. 2024 తెలుగు ఇండస్ట్రీకి కీలకంగా మారబోతుంది. ఎందుకంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్.. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్, తారక్ నటిస్తున్న సినిమాలు వచ్చేది వచ్చే ఏడాదే కాబట్టి. ఈ ముగ్గురు హీరోల నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి.. వాటన్నింటి బిజినెస్ లెక్కేస్తే 1500 కోట్లు దాటిపోతుందంటే వాళ్ళ రేంజ్ అర్థం అయిపోతుంది.
పుష్పతో పాన్ ఇండియన్ సర్కిల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. మొదటి అటెంప్ట్‌లోనే 350 కోట్లు వసూలు చేసారు. దాంతో ఇప్పుడు పార్ట్ 2పై అంచనాలు మామూలుగా లేవు. ముఖ్యంగా ఈ సినిమా అనుకున్నట్లుగా హిట్టైతే 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. తెలుగు కంటే హిందీలోనే పుష్ప 2 మార్కెట్ ఎక్కువగా ఉంది.
మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ చేస్తున్న సినిమా కావడంతో మామూలుగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి.. పైగా చరణ్ మార్కెట్ డబుల్ అవ్వడంతో గేమ్ ఛేంజర్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ముందు 2023 అనుకున్నా.. 2024 సమ్మర్ తర్వాతే ఈ సినిమా విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర రీ సౌండ్ కూడా బాగానే ఉంది. తెలుగులో దీనికి తిరుగులేదు.. ఇక బాలీవుడ్‌లోనూ దేవర గురించి చర్చ బాగానే జరుగుతుంది. ఈ సినిమా ఎప్రిల్ 5, 2024న విడుదల కానుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..