Pushpa 2 : పుష్ప 2 టీజర్ రీక్రియేట్.. పుష్పరాజ్‌గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే…
ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ యాక్టింగ్, స్టైల్, మ్యానరిజం చూసి ఫిదా అయ్యారు. అలాగే ఈ చిత్రంలోని ప్రతిసాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ గురించి చెప్పక్కర్లేదు. అడియన్స్ అసలు ఊహించని రేంజ్లో బన్నీని చూపించి ఫుల్ ఖుషి చేశారు సుకుమార్.

యావత్ దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఎక్కువగా నార్త్ అడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ యాక్టింగ్, స్టైల్, మ్యానరిజం చూసి ఫిదా అయ్యారు. అలాగే ఈ చిత్రంలోని ప్రతిసాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ గురించి చెప్పక్కర్లేదు. అడియన్స్ అసలు ఊహించని రేంజ్లో బన్నీని చూపించి ఫుల్ ఖుషి చేశారు సుకుమార్.
గంగానమ్మ జాతరలో అమ్మోరు గెటప్‌లో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు. ఈ టీజర్ అభిమానులకు తెగ నచ్చేసింది. కేవలం ఒక్క నిమిషంపాటు ఉన్న ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టించింది. డైలాగ్స్ లేకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే హైప్ పెంచేశారు. దీంతో ఇక పుష్ప 2 ఎలా ఉండనుందో ఒక్క టీజర్ తోనే చెప్పేశారు. తాజాగా కొందరు టీజర్ ను రీక్రియేట్ చేశారు. ఒరిజినల్ టీజర్ ను ఎలా కట్ చేశారో సేమ్ అలాగే చిన్నపిల్లలతో ఓ టీజర్ రీక్రియేట్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక ఇది కాస్త పుష్ప టీం వరకు వెళ్లింది. దీంతో ఆ వీడియోపై పుష్ప చిత్రయూనిట్ రియాక్ట్ అవుతూ.. టీజర్ రీక్రియేట్ చేసినవారిని అభినందించింది. టీజర్ రీక్రియేట్ చేసిన వారిపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆ టీజర్ ను మీరు చూసేయ్యండి.
It’s an extremely good execution of #Pushpa2TheRuleTeaser 🔥🔥🔥
Great work 👌👌.. Congratulations to the whole team who did this MASSIVE recreation 💥💥 https://t.co/N0x7HhIYaH
— Pushpa (@PushpaMovie) April 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
