Allu Arjun: జాతీయ అవార్డు విజేతలను అభినందించిన అల్లు అర్జున్..

71జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. 22 భాషల్లో 115 సినిమాలు వీక్షించిన జ్యురీ అవార్డులను అనౌన్స్ చేసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Allu Arjun: జాతీయ అవార్డు విజేతలను అభినందించిన అల్లు అర్జున్..
Allu Arjun

Updated on: Aug 02, 2025 | 5:06 PM

71వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకు అవార్డు అనౌన్స్ చేశారు. అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరిలో హనుమాన్ సినిమాను అనౌన్స్ చేశారు. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలాగే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు శుకృతివేణి( గాంధీ తాత చేటు) ఎంపికైంది, బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో బలగం సినిమాకు అవార్డు ప్రకటించారు. వేణు దర్శకత్వంలో బలగం వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా బేబీ సినిమాకు గాను సాయి రాజేష్ కు అవార్డు ప్రకటించారు. అదేవిధంగా బెస్ట్ మేల్ సింగర్ గా పీవీఎన్ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా పాట) అవార్డు వరించింది.

ఒకప్పుడు హోటల్‌లో పని.. ఇండస్ట్రీలో తోప్.. రాజకీయాల్లో టాప్.. ఈమె ఎవరో తెలుసా.?

71వ జాతీయ పురస్కారాలు దక్కించుకున్న వారికి సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరికొంతమంది ప్రముఖులు జాతీయ పురస్కారాలు అందుకున్నవారిని అభినందించారు. తాజాగా అల్లు అర్జున్ కూడా 71వ జాతీయ పురస్కారాలు దక్కించుకున్న వారికి అభినందలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదేం ట్విస్ట్ మావ..! ఈ సీనియర్ నటి చెల్లి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయినా..!

తెలుగు సినిమాలే కాదు హిందీలోనూ  అవార్డు దక్కించుకున్నవారిని కూడా అల్లు అర్జున్ అభినందించారు. ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్, విక్రాంత్ మస్సే పేర్లు అనౌన్స్ చేశారు. షారుక్ ఖాన్ , విక్రాంత్ మస్సేలను అల్లు అర్జున్ అభినందించారు. 12th ఫెయిల్ తన ఫేవరెట్ మూవీ అని తెలిపాడు బన్నీ. అలానే ఉత్తమ నటిగా నిలిచిన రాణీ ముఖర్జీకి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ వరుసగా ట్వీట్ లు వేశారు.

పెళ్ళైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.. సినిమాలకు దూరమై ఇప్పుడు ఇలా..

అల్లు అర్జున్ ట్వీట్..

అల్లు అర్జున్ ట్వీట్..

అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.