
అల్లు అర్జున్.. ఈ పేరుకు ఇప్పుడున్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. కానీ ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. యాక్టింగ్ , లుక్స్ ను ఎగతాళి చేశారు. కట్ చేస్తే.. ఆర్య సినిమాతో విమర్శకులకు చెక్ పెట్టాడు. ఈ మూవీతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత బన్నీ వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్న బన్నీ కెరీర్ మార్చిన మరో సినిమా పుష్ప 1. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 1, 2 సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అయితే బన్నీ జీవితాన్ని మార్చిన ఆర్య, పుష్ప 1 సినిమాలకు దర్శకత్వం వహించింది డైరెక్టర్ సుకుమార్. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
తనకు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టిన డైరెక్టర్ సుకుమార్ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. ఈ విషయాన్ని ఇదివరకు పలు సందర్భాల్లో బయటపెట్టాడు. ఇప్పుడు జనవరి 11న సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి సుకుమార్ పై తన ప్రేమను వెల్లడించాడు. ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “హ్యాపీ బర్త్ డే సుక్కు డార్లింగ్.. ఈరోజు నీకంటే నాకే ఎక్కువ ప్రత్యేకం ఈరోజు. ఎందుకంటే ఈరోజు నా జీవితాన్ని మార్చింది. నా జీవితంలో నువ్వు ఉండడం వల్ల నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను” అంటూ సుకుమార్ పై తన ప్రేమను వ్యక్తం చేశారు. చివర్లో పుట్టినందుకు థ్యాంక్స్.. అంటూనే కాపీరైట్స్ అంటూ హీరో నవదీప్ ను ట్యా్గ్ చేశాడు. ప్రస్తుతం బన్నీ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్, సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ముఖ్యంగా బన్నీ జీవితంలో సుకుమార్ పాత్ర ప్రత్యేకం. హీరోగా ఆయన జీవితానికి బ్రేక్ ఇచ్చింది ఆర్య సినిమా. ఈ మూవీతో బన్నీ స్టైలీష్ స్టార్ గా యూత్ ఐకాన్ గా మారాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కాగా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు బన్నీ.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..