Allu Arha: శ్రీవల్లి పాటకు క్లింకారాతో అల్లు అర్హ డాన్స్.. క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాసన..
నిన్న సంక్రాంతి సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీస్ ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. క్రీమ్ అండ్ రెడ్ డ్రెస్ కోడ్లో రెండు కుటుంబాలు సందడి చేశాయి. ఆడవాళ్లంతా రెడ్ కలర్.. మగవాళ్లంతా క్రీమ్ కలర్ డ్రెస్ కోడ్లో కనిపించారు. ఈ ఫోటోలో అందరి చూపు పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్ పైనే పడింది. సంక్రాంతి సందర్భంగా తన చెల్లెలు ఆద్యతో సరదాగా ఫైట్ చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా బెంగుళూరులోని ఫాంహౌస్ లో సంక్రాంతి వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ ఫ్యామిలీ, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య, అకీరా నందన్, ఆద్య సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను మెగా ఫ్యామిలీ పెద్ద కోడలు ఉపాసన ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు. నిన్న సంక్రాంతి సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీస్ ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. క్రీమ్ అండ్ రెడ్ డ్రెస్ కోడ్లో రెండు కుటుంబాలు సందడి చేశాయి. ఆడవాళ్లంతా రెడ్ కలర్.. మగవాళ్లంతా క్రీమ్ కలర్ డ్రెస్ కోడ్లో కనిపించారు. ఈ ఫోటోలో అందరి చూపు పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్ పైనే పడింది. సంక్రాంతి సందర్భంగా తన చెల్లెలు ఆద్యతో సరదాగా ఫైట్ చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలకు పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాలో చెల్లిపోని బంధం నువ్వమ్మా.. చిట్టి చెల్లెమ్మా పాటను జత చేసి వీడియోను షేర్ చేశారు రేణు దేశాయ్. ఫైనల్ గా వాళ్ల నాన్న పాట రీల్ లైఫ్ కు బదులుగా రియల్ లైఫ్ లో అవుతోంది అంటూ రాసుకొచ్చారు.
ఇక ఆ ఫోటోల్లో అకీరా నందన్.. అచ్చం పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ లో కనిపించాడు. పవన్ హెయిర్ స్టైల్, కత్తుల్లాంటి కళ్లతో వింటేజ్ పవర్ స్టార్ ను గుర్తుకు తెచ్చాడు. దీంతో అకీరా నందన్ ఫోటోస్ షేర్ చేస్తూ జూనియర్ పవర్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇదిలా ఉంటే..ఇప్పుడు సోషల్ మీడియాలో మరో క్యూట్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఓవైపు పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. మరోవైపు రామ్ చరణ్ గారాల పట్టి క్లింకారా గురించి తెగ వెతికేస్తున్నారు మెగా అభిమానులు. క్లింకారా ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. నిన్న షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోలో క్లింకారా ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మెగా ఫ్యామిలీ. తాజాగా క్లింకారాతో కలిసి అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ ఆటలాడుతున్న వీడియో వైరలవుతుంది.
View this post on Instagram
Kalyan ~ Akira ❤️❤️@PawanKalyan #AkiraNandan pic.twitter.com/UkbUZ3M5ad
— Pawanism Network (@PawanismNetwork) January 15, 2024
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు క్లీంకారాతో ముద్దుగా అడుకుంటోంది అర్హ. చూపే బంగారమాయేరా అని పాట వస్తుంటే.. అటూ ఇటూ ఊగుతూ అర్హ ఆడుకుంటుంది. ఉపాసన క్లీంకారాను ఎత్తుకుని నిల్చుండగా.. క్లీంకారా చిన్ని చిన్ని కాళ్లు పట్టుకుని ఆడిస్తోన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం ఈ వీడియోను షేర్ చేస్తూ.. క్యూట్ ఫ్రెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అర్హ, క్లీంకారా క్యూట్ వీడియోను మీరు చూసేయ్యండి.
ARHA playing with KLIN KARA 🥰 pic.twitter.com/YWeJlxbE73
— RRReddy (@RamRohitReddy) January 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.