Allu Arjun: ప్రభాస్, షారుఖ్‌లను బీట్ చేసిన అల్లు అర్జున్.. పుష్ప 2 కోసం ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కు ముందే ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Allu Arjun: ప్రభాస్, షారుఖ్‌లను బీట్ చేసిన అల్లు అర్జున్.. పుష్ప 2 కోసం ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2024 | 10:57 AM

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అతను ఓ పాన్ ఇండియా హీరో. ముఖ్యంగా పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు.ఇక ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ గురించి పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బన్నీ ఒక సినిమాకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటాడని కొందరంటే 100 కోట్ల రూపాయలు అని మరికొందరు చెప్పారు. అయితే ఇవన్నీ రూమర్లేనని, అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడని ప్రముఖ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ఇండియా తెలిపింది. 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్‌-10 నటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్‌ రూ.300 కోట్లతో అగ్రస్థానంలో ఉండడం విశేషం. పుష్ప 2 సినిమాకు గానూ ఈ రికార్డు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఫోర్బ్స్ ఇండియా నివేదించింది.

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ ఉన్నారు. అలాగే తమిళంలో దళపతి విజయ్, రజనీకాంత్ వంటి క్రేజీ హీరోలు ఉన్నారు. వీరి డేట్స్ కావాలంటే రెమ్యునరేషన్ గా కోట్లాది రూపాయలు ఇవ్వాల్సిందే. అయితే వీరందరిని బన్నీ మించిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 300 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. అల్లు అర్జున్ పారితోషికం విషయంలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, దళపతి విజయ్, రజనీకాంత్‌లను మించిపోయాడు. విజయ్ ఒక్కో సినిమాకు 250 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ, అల్లు అర్జున్ విజయ్ ను కూడా అధిగమించాడు. అతను ఇప్పుడు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

టాప్-10 నటులు వీరే..

ఇక బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.150 నుంచి 250 కోట్లు తీస్తున్నాడు. అతను ఈ లిస్టులో మూడో ప్లేస్ లో నిలిచాడు. రజనీకాంత్ (రూ. 125-200 కోట్లు), అమీర్ ఖాన్ (రూ. 100-200 కోట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఆరో స్థానంలో ఉన్న ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోనున్నాడు. ఆ తర్వాత అజిత్ కుమార్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. టాప్ 10లో ఆరుగురు హీరోలు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.