AP News: అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్.. అసలేం జరిగిందంటే
ఓ వ్యక్తి ఉదయాన్నే రోజులా పొలం పనులు చేసుకునేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. పొలానికి వెళ్లిన అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది. ఆ స్టోరీ ఎంతంటే..
అనకాపల్లి జిల్లాలో పగలు, రాత్రి తేడా లేకుండా అడవి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. స్థానిక అధికారులు పందులను నివారించేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. అవి విఫలమవుతూనే ఉన్నాయి. పందుల కారణంగా అపరిశుభ్రత పెరగడమే కాదు.. అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల నాతవరం మండలం శృంగవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన నీలి నాగేశ్వరరావు అనే వ్యక్తిపై అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్ర గాయాలపాలై.. ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికులు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
Latest Videos