Naandhi Movie Review : ఊహించినట్టే అద్భుత నటనతో ఆకట్టుకున్న నరేష్.. నాంది సినిమా పై ప్రేక్షకులు ఏమంటున్నారంటే..

అల్లరి’ నరేష్‌ హీరోగా ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిన ‘నాంది’ చిత్రం. ‘క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో  తెరకెక్కిన చిత్రం ఇది. విజయ్‌ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

Naandhi Movie Review : ఊహించినట్టే అద్భుత నటనతో ఆకట్టుకున్న నరేష్.. నాంది సినిమా పై ప్రేక్షకులు ఏమంటున్నారంటే..
Follow us

|

Updated on: Feb 19, 2021 | 12:54 PM

Naandhi Movie Twitter Review :

నటులు : ‘అల్లరి’ నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్

దర్శకత్వం :  విజయ్‌ కనకమేడల

సంగీతం : శ్రీచరణ్‌ పాకాల

నిర్మాత : స‌తీష్ వేగేశ్న

‘అల్లరి’ నరేష్‌ హీరోగా ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిన ‘నాంది’ చిత్రం. ‘క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో  తెరకెక్కిన చిత్రం ఇది. విజయ్‌ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్‌ పాకాల అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 19న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే టీజర్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను ఆసక్తిని పెంచింది ఈ మూవీ ఇక ఈ మూవీ ఎలా ఉందంటే..

”గమ్యం, ప్రాణం” లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి సత్తా చాటిన ఆయన, ఇప్పుడు ‘నాంది’ అంటూ మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో నరేష్ యాక్టింగ్ వేరే లెవల్ లో ఉందని. నరేష్ నటన సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ తో పోల్చుకుంటే సెకండ్ ఆఫ్ మరింత  థ్రిల్లింగ్ గా అనిపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందరు ఊహించినట్టే నరేష్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారని ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన నటనతో మెప్పించారని కామెంట్స్ పెడుతున్నారు.

ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ తమ తమ పాత్రలమేరకు ఆకట్టుకున్నారట. చేయని నేరం వల్ల శిక్ష అనుభవిస్తున్న నరేష్.. ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు.  అనే పాయింట్ తీసుకొని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు విజయ్‌ కనకమేడల. ఈ సినిమాతో నరేష్ మరోసారి తన అద్భుత నటనను కారబరిచాడని అంటున్నారు.