Allari Naresh :కామెడీ కంటెంట్ సినిమాలే కాదు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ అలరిస్తున్నాడు నరేష్. ఇటీవలే నాంది అనే సినిమాతో మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఛాలెంజింగ్ రోల్ లో నరేష్ జీవించాడనే చెప్పాలి. విభిన్నమైన కథలను ఇక పై వదులుకోను అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నరేష్. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలను కమిట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నాడు నరేష్. నేడు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రీలుక్ ను రిలీజ్ చేశారు. సభకు నమస్కారం అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా నరేష్ కెరియర్ లో 58వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాతో మల్లంపాటి సతీష్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచయిత అబ్బూరి రవి ఈ సినిమాకి సంభాషణలు రాస్తున్నారు.
ఇక ఈ సినిమా పోస్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజన్ చేశారు. ఇందులో బ్యాక్ సైడ్ వ్యూలో నరేష్ మామైక్ ముందు నిలబడి.. రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెడుతూ కనిపిస్తున్నాడు. అలాగే నరేశ్ బ్యాక్ పాకెట్ లో డబ్బులు – మరో పాకెట్ లో మందు బాటిల్ ఉన్నాయి. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా పొలిటికల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ‘సభకు నమస్కారం’ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది.
Sabhaku Namaskaram ?… with @smkoneru garu, @MallampatiSate1 and @abburiravi garu . #Naresh58 pic.twitter.com/cDXxmUarhr
— Allari Naresh (@allarinaresh) June 30, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :