Alia Bhatt: అమ్మయిన 4 నెలలకే.. చీరకట్టులో నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన అలియా.. అమ్మడి గ్రేస్‌కు ఫ్యాన్స్‌ ఫిదా

ప్రస్తుతం ప్రపంచమంతటా నాటు నాటు సాంగ్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఈ పాటకు రోజురోజుకు క్రేజ్‌ పెరిగిపోతోంది. దేశ, విదేశాల్లోనూ ఈ పాట మార్మోగిపోతోంది. ఇప్పటికే గ్లోబల్‌ గ్లోబ్‌ అవార్డు గెల్చుకున్న ఈ పాపులర్‌ సాంగ్‌కు ఇక ఆస్కార్‌ రావడమే తరువాయి.

Alia Bhatt: అమ్మయిన 4 నెలలకే.. చీరకట్టులో నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన అలియా.. అమ్మడి గ్రేస్‌కు ఫ్యాన్స్‌ ఫిదా
Alia Bhatt

Updated on: Feb 28, 2023 | 6:05 AM

ప్రస్తుతం ప్రపంచమంతటా నాటు నాటు సాంగ్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఈ పాటకు రోజురోజుకు క్రేజ్‌ పెరిగిపోతోంది. దేశ, విదేశాల్లోనూ ఈ పాట మార్మోగిపోతోంది. ఇప్పటికే గ్లోబల్‌ గ్లోబ్‌ అవార్డు గెల్చుకున్న ఈ పాపులర్‌ సాంగ్‌కు ఇక ఆస్కార్‌ రావడమే తరువాయి. ఖండాంతరాలు దాటి క్రేజ్‌ తెచ్చుకుంటోన్న ఈ నాటు నాటు సాంగ్‌కు తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ అలియా భట్‌ అదిరిపోయే స్టెప్పులేసింది .అది కూడా చీరకట్టులో. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అలియా ఇలా స్టేజీపై స్టెప్పులేయడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘జీ సినిమా అవార్డుల’ ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. బోనీకపూర్‌, వివేక్‌ అగ్నిహోత్రి, అయాన్‌ ముఖర్జీ, ఆయుష్మాన్‌ ఖురానా, అలియా భట్‌, కార్తిక్‌ ఆర్యన్‌, రష్మిక మందన్నా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తదితరుల ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ‘గంగూబాయి కఠియావాడి’, ‘డార్లింగ్స్‌’ చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా అవార్డులు గెల్చుకుంది అలియా.

ఈ సంతోషంలో అలియా తన డ్యాన్స్‌తో అభిమానులను హుషారెత్తించింది. తను నటించిన హిట్‌ సినిమాల్లోని సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులేసిందీ స్టార్‌ హీరోయిన్‌. ఈ క్రమంలో స్టార్‌ హోస్ట్‌లు ఆయుష్మాన్‌ ఖురానా, అపరశక్తి ఖురానాతో కలిసి ‘నాటు నాటు’ పాట హిందీ వెర్షన్‌కు అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. ఒక అభిమాని ఈ వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. చీరకట్టులో అలియా గ్రేస్‌ను చూసి ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ‘నాలుగు నెలల క్రితమే పాపకు జన్మనిచ్చింది. అంతలోనే ఎంత గ్రేస్‌తో డ్యాన్స్‌ చేస్తుందో’ అంటూ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..