AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ‘ఎప్పటికైనా అతనితో నటించాలన్నదే నా కోరిక’.. కేన్స్ వేదికగా ఆ హీరోపై అలియా ప్రశంసలు

ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా హాజరైంది. ఈ సమయంలో ఆమె కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన నటులలో ఒకరి గురించి నటి అలియా భట్ చాలా గొప్పగా మాట్లాడింది, అతనితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇంతకీ ఆ నటుడు ఎవరు?

Alia Bhatt: 'ఎప్పటికైనా అతనితో నటించాలన్నదే నా కోరిక'.. కేన్స్ వేదికగా ఆ హీరోపై అలియా ప్రశంసలు
Alia Bhatt
Basha Shek
|

Updated on: May 26, 2025 | 3:04 PM

Share

ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పలువురు భారతీయ నటీమణులు, హీరోలు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, ఊర్వశి రౌతెలా, ప్రణీతా సుభాష్.. ఇలా ఎందరో స్టార్స్ రెడ్ కార్పెట్ పై నడిచారు. అయితే లేటుగా వచ్చినా కేన్స్ లో అదరగొట్టింది బాలీవుడ్ అందాల తార అలియా భట్. కలర్ ఫుల్ డ్రెస్సుల్లో ముస్తాబై రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి కూడా అలియా భట్ ముఖ్య అతిథిగా హాజరైంది. కేన్స్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఈ సమయంలో పలు ప్రశ్నలకు అలియా భట్ సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా అలియా ఒక ప్రతిభావంతుడైన దక్షిణ భారత నటుడి గురించి కూడా మాట్లాడటం విశేషం. అతనెవరో కాదు పుష్ప 2 విలన్ ఫహద్ ఫాజిల్.

ఇవి కూడా చదవండి

‘ఫహద్ ఫాజిల్ నటనంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు నేను బాగా చూస్తాను. ఫహద్ ఫాజిల్ ప్రతిభను నేను చాలా గౌరవిస్తాను. ఆయనొక అద్భుతమైన పెర్ఫార్మర్. ఫహాద్ తో కలిసి పనిచేయడమనేది నాకు దక్కిన ఓ గొప్ప గౌరవంగా భావిస్తాను. ఏదో ఒక రోజు ఆ ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. ఈ మధ్యన మలయాళ చిత్ర పరిశ్రమ అద్భుతమైన సినిమాలను ఇస్తోంది. ఆ సినిమా పరిశ్రమ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. మలయాళ నటుడు రోషన్ మాథ్యూతో కలిసి ‘డార్లింగ్స్’ సినిమాలో నటించాను. అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఆయన హిందీ ప్రేక్షకులకు కూడా ఇష్టమైన నటుడు’ అని చెప్పుకొచ్చింది అలియా.

భవిష్యత్తులో ప్రాంతీయ భాషా సినిమాలు తీస్తారా అని అలియాను అడిగితే.. ‘ప్రాంతీయ, బాలీవుడ్ మధ్య ఎటువంటి తేడా లేదని కోవిడ్ మాకు అర్థమయ్యేలా చేసింది. మనమందరం ఒకే రంగానికి చెందిన వాళ్లం. కాబట్టి మా మధ్య ఎటువంటి తేడాలు లేవు. మీరు మీ పనిని ప్రపంచంలోని ఏ మూలలోని ప్రజలకు అయినా అందించవచ్చు. అదేవిధంగా, మనం ఏదైనా కంటెంట్‌ను కూడా చూడవచ్చు. నేను ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న యానిమేటెడ్ సినిమా చూస్తున్నాను. “OTT అనే ప్లాట్‌ఫామ్ వల్లే నేను ఒక నిర్దిష్ట మూలలో తీసిన సినిమాను చూడగలిగాను. అక్కడి ప్రజలను అర్థం చేసుకోగలిగాను” అని అలియా పేర్కొంది.

కేన్స్ లో అలియా భట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే