నక్కతోక తొక్కడం అంటే ఇదేనయ్యో.. అల్లు అర్జున్ సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ తరహాలో ఒక సూపర్ హీరో కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అనేక ప్రసిద్ధ హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
అలాగే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందనుందని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారని సమాచారం. అందుకే అట్లీ సినిమాలో ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆమె పాన్ ఇండియా బ్యూటీ దీపికా పదుకొణె. ఒకవేళ ఇదే నిజమైతే కల్కి తర్వాత దీపిక నటిస్తోన్న రెండు తెలుగు సినిమా అల్లు అర్జున్ దే అవుతుంది. కొన్ని నెలల క్రితమే తల్లి గా ప్రమోషన్ పొందింది దీపిక. దీంతో సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆమెకు ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే షారుఖ్ ఖాన్ సరసన ‘కింగ్’ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించింది దీపిక. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘స్పిరిట్’ సినిమాలో కూడా ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అదే సమయంలో అల్లు అర్జున్ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పవచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తొమ్మిదేళ్లప్పుడు మిస్సింగ్.. గూగుల్ మ్యాప్ సాయంతో.. 38 ఏళ్ల ఏజ్లో పేరెంట్స్ చెంతకు..

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
