Gangubai Kathiawadi: మరోసారి సత్తా చాటిన అలియాభట్ సినిమా.. మూడు అవార్డ్స్ అందుకున్న గంగూబాయి

ముంబయిలోని కామాఠిపుర రాజ్యానికి గంగూబాయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగిందన్న కథాంశంతో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించారు.2022 ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ రివ్యూస్‌ సొంతం చేసుకుంది.

Gangubai Kathiawadi: మరోసారి సత్తా చాటిన అలియాభట్ సినిమా.. మూడు అవార్డ్స్ అందుకున్న గంగూబాయి
Gangubai Kathiawadi
Follow us

|

Updated on: May 28, 2023 | 9:16 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియాభట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గంగూబాయి కతియావాడి. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించారు. ముంబయిలోని కామాఠిపుర రాజ్యానికి గంగూబాయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగిందన్న కథాంశంతో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 2022 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ రివ్యూస్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతోంది. సినిమాలో అలియా అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. 150 కొట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమాకు పలు అవార్డులు దక్కాయి. తాజాగా మరో మూడు అవార్డులు కూడా ఈ సినిమాకు రావడంతో చిత్రయూనిట్ అందంతో తేలిపోతున్నారు.

ఐఫా అవార్డుల్లో గంగూబాయి కతియావాడి మూడు విభాగాల్లో ఎంపికైంది. దుబాయ్‌లో జరుగుతున్న ఐఫా-2023 అవార్డుల కార్యక్రమంలో ఈ సినిమా సత్తా చాటింది. ఏకంగా మూడు విభాగాలు అవార్డులు అందుకొని తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. ఈ సినిమా తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా-2 రెండు అవార్డులు దక్కించుకుంది.

స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, సినిమాటోగ్రఫీ అవార్డులను ‘గంగూబాయి కతియావాడి దక్కించుకుంది. ఈ సినిమాకు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఐఫా-2023 కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్  స్టార్ పాల్గొన్నారు. సల్మాన్‌ఖాన్‌, విక్కీ కౌశల్‌, వరుణ్‌ ధావన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నోరా ఫతేహి పాల్గొన్న ఈ వేడుకలో టెక్నికల్‌ అవార్డులను అందజేశారు. ఇక సౌత్ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ ఈ వేడుకలకు హాజరయ్యారు.