Sumanth ‘సీతా రామం’ సినిమాలో ఆ సవాల్ నచ్చే ఒప్పుకున్నా.. సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హన్ను రాఘవపూడి మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆ తర్వాత లై, పడిపడి లేచే మనసు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.

అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హన్ను రాఘవపూడి(Hanu Raghavapudi) మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆ తర్వాత లై, పడిపడి లేచే మనసు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా సీతారామం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హన్ను. దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా, రష్మిక మందన్న కీలక పాత్రలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో అక్కినేని సుమంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇటీవలే విడుదల చేశారు. తాజాగా సుమంత్ మాట్లాడుతూ సీతా రామం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సుమంత్ మాట్లాడుతూ.. నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్ చేస్తానని ఎప్పటినుండో చెబుతున్నాను. మంచి పాత్రలు ,అవకాశం కోసం ఎదురుచూశాను. బ్రిగేడియర్ విష్ణు శర్మ చాలా క్లిష్టమైన పాత్ర. చాలా కోణాలు వుంటాయి. కథకి చాలా కీలకమైన పాత్ర. స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత అద్భుతం అనిపించింది. ఇలాంటి పాత్రలు సాదారణంగా రావు. ఇది నెగిటివ్ పాత్ర కాదు. కానీ చాలా వైవిధ్యంగా వుంటుంది. ఒక సవాల్ తో కూడుకున్న పాత్ర. ఆ సవాల్ నచ్చే ఒప్పుకున్నా అన్ని అన్నారు. అలాగే వైజయంతి మూవీస్ ఒక క్లాసిక్ ఎపిక్ బ్యానర్. అశ్వినీదత్ గారితో ఎప్పటినుండో పరిచయం, చనువు వుంది. దత్ గారు సినిమాలో నా రషెస్ చూసి మా నాన్నగారికి ఫోన్ చేసి అద్భుతంగా చేశాడని చెప్పారు. వైజయంతిలో పని చేయడం గొప్ప అనుభవం అన్నారు. అలాగే వెబ్ సిరీస్ లగురించి మాట్లాడుతూ..ఒక నటుడిగా అన్నీ చేయాలనీ వుంటుంది. కొన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే మంచి అవకాశం చూస్తున్నాను. ఓటీటీలో భిన్నమైన కథలు చెప్పే అవకాశం వుంటుంది. సవాల్ తో కూడిన కథలు వుంటాయి. నాకు నచ్చిన కథ కుదిరిరితే తప్పకుండా చేస్తా అన్నారు సుమంత్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



