23 March 2025
కార్తీతో ఆ హీరోయిన్.. కాంబో అదిరిపోయిందంటోన్న ఫ్యాన్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
కోలీవుడ్ హీరో కార్తీ ఇటీవలే సత్యం సుందరం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఖైదీ 2, కార్తీ 29 సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే కార్తీ 29 సినిమాకు తనకరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. వడివేలు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కార్తీ సరసన యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ సైతం నటించనుంది. మే లేదా జూన్ నెలలో ఈ మూవీ షూటింగ్ స్టార్ కానుంది.
చాలా కాలంగా సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది కళ్యాణి ప్రియదర్శన్. కొన్నాళ్లుగా మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇటీవలే కీర్తి సురేష్ పెళ్లిలో సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే అటు సోషల్ మీడియాలో నిత్యం ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.
చాలా కాలం తర్వాత తమిళంలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. కానీ ఈ వయ్యారికి తెలుగులో వరుస డిజాస్టర్స్ రావడంతో అంతగా ఆఫర్స్ రాలేదు.
తెలుగులో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ బ్యూటీ నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం కార్తీ సరసన ఛాన్స్ కొట్టేసింది కళ్యాణి ప్రియదర్శన్. దీంతో వీరిద్దరి కాంబో అదిరిపోయిందని.. కళ్యాణికి హిట్ రావడం పక్కా అంటున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్