Naga Chaitanya: జోరు పెంచిన అక్కినేని కుర్ర హీరో.. బిజీ బిజీగా నాగ చైతన్య

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి చాలా బిజీగా ఉన్నాడు. గత ఏడాది  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు చైతూ.

Naga Chaitanya: జోరు పెంచిన అక్కినేని కుర్ర హీరో.. బిజీ బిజీగా నాగ చైతన్య
Nag Chaithnya
Follow us
Rajeev Rayala

|

Updated on: May 31, 2022 | 8:35 PM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి చాలా బిజీగా ఉన్నాడు. గత ఏడాది  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు చైతూ. ఇక ఇప్పుడు  విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమాకు థాంక్యూ  అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుపుకుంటుంది ఈ మూవీ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణంలో దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ సినిమ పై ఆసక్తిని పెంచేసింది. ఇక ఈ సినిమాతో పటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ క్రేజీ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీని హాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ‘  విక్రమ్ కె. కుమార్ అమెజాన్ ప్రైమ్ కోసం డైరెక్ట్ చేస్తున్న ‘దూత’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు నాగ చైతన్య. 10 ఎపిసోడ్స్ గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాగ చైతన్య బిజీ బిజీగా గడుపుతున్నాడు.

ఇవి కూడా చదవండి

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్