Akhil Akkineni: నేను ప్రస్తుతానికి సింగిలే.. పెళ్లి పై అక్కినేని అందగాడు అఖిల్ ఆసక్తికర కామెంట్స్

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Akhil Akkineni: నేను ప్రస్తుతానికి సింగిలే.. పెళ్లి పై అక్కినేని అందగాడు అఖిల్ ఆసక్తికర కామెంట్స్
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 20, 2023 | 3:07 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో ఏజెంట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. అలాగే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్పీడ్ గానే జరుగుతున్నాయి. రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా అఖిల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

దానిలో భాగంగానే తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అందరూ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారని.. నన్ను అప్పుడే పెళ్లి చేసుకోమంటారా.? అని సరదాగా చెప్పుకొచ్చాడు అఖిల్. నేను ఎవరితోనూ రిలేషన్ లో లేను నేను ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నా అని చెప్పుకొచ్చాడు అఖిల్.