Agent: సెన్సార్ పూర్తి చేసుకున్న ఏజెంట్.. సినిమా రన్ టైం ఎంతంటే

చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా తో హిట్ అందుకున్నాడు కానీ ఆ సినిమా హిట్ పూజా హెగ్డే ఖాతాలో పడింది. అక్కినేని అభిమానులకు ఆ హిట్ సరిపోలేదు. ఇక ఇప్పుడు ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Agent: సెన్సార్ పూర్తి చేసుకున్న ఏజెంట్.. సినిమా రన్ టైం ఎంతంటే
Agent
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 23, 2023 | 2:55 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఈ సాయి పక్కా సాలిడ్ హిట్ కొడతారని అంటున్నారు ఫ్యాన్స్. అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. తొలి సినిమాతో యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చిన అఖిల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా తో హిట్ అందుకున్నాడు కానీ ఆ సినిమా హిట్ పూజా హెగ్డే ఖాతాలో పడింది. అక్కినేని అభిమానులకు ఆ హిట్ సరిపోలేదు. ఇక ఇప్పుడు ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కు కింగ్ నాగార్జున గెస్ట్ గా హాజరు కానున్నారు.

తాజాగా ఏజెంట్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 36 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సినిమా బాగుందని, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.