Liger Movie: యూట్యూబ్‍ను షేక్ చేస్తోన్న ‘అక్‏డి పక్‏డి’ సాంగ్.. లైగర్ దెబ్బకు రికార్డులు బద్దలయ్యేనా..

Akdi Pakdi Song: ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా.. భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. హిందీలో మోహ్‌సిన్‌ షైక్‌, అజీమ్‌ దయాని అందించగా లిజియో జార్జ్‌ సంగీతం అందించారు.

Liger Movie: యూట్యూబ్‍ను షేక్ చేస్తోన్న అక్‏డి పక్‏డి సాంగ్.. లైగర్ దెబ్బకు రికార్డులు బద్దలయ్యేనా..
Akdi Pakdi Song

Updated on: Jul 12, 2022 | 3:35 PM

Akdi Pakdi Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( (Vijay Devarakonda)) నటిస్తోన్న లైగర్ (Liger) సినిమా నుంచి విడుదలైన ‘అక్‏డి పక్‏డి’ సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ సాంగ్ 15 మిలియన్లకు పైగా వ్యూస్.. 8 లక్షలకు పైగా లైక్స్‏ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మేకర్స్. ఈ పాటకు నెట్టింట్ ఓ రేంజ్‏లో రెస్పాన్స్ వస్తోంది. మొదటి సారి మాస్ స్టెప్పులతో అదరగొట్టారు విజయ్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అతని సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేయగా.. ఇక సోమవారం రిలీజ్ అయిన ‘అక్‏డి పక్‏డి’ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా.. భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. హిందీలో మోహ్‌సిన్‌ షైక్‌, అజీమ్‌ దయాని అందించగా లిజియో జార్జ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, ఛార్మీ, పూరి జగన్నాథ్ కలిసి ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించడగా.. మైక్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.