AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R. Sarathkumar: నన్ను సీఎం చేయండి.. 150 ఏళ్లు బతికే సీక్రెట్‌ చెబుతా.. శరత్‌ కుమార్‌ షాకింగ్ కామెంట్స్

వెండితెరపై స్టార్‌ హీరోలుగా వెలుగొంది .. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు. నాటి సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి నేటి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరకు అనేక మంది సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారే.

R. Sarathkumar: నన్ను సీఎం చేయండి.. 150 ఏళ్లు బతికే సీక్రెట్‌ చెబుతా.. శరత్‌ కుమార్‌ షాకింగ్ కామెంట్స్
Sarathkumar
Basha Shek
|

Updated on: May 30, 2023 | 7:34 PM

Share

వెండితెరపై స్టార్‌ హీరోలుగా వెలుగొంది .. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు. నాటి సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి నేటి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరకు అనేక మంది సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారే. అయితే పాలిటిక్స్‌లో సక్సెస్‌ అయిన వాళ్లని వేళ్లమీద లెక్క పెట్టవచ్చు. సీనియర్‌ ఎన్టీఆర్‌, అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత మాత్రమే ముఖ్యమంత్రి పదవులను అధిరోహించారు. ఇక కమల్ హాసన్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా పొలిటిక్‌ పార్టీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అటువంటి వారిలో ప్రముఖ తమిళ నటుడు శరత్‌ కుమార్‌ ఒకరు. సినిమాలతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆయన మొదట డీఎంకేలో, ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరారు. అయితే ఏ పార్టీలోనూ ఇమడలేని ఆయన 2007లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పేరుతో సొంత పార్టీని ఏర్పాటుచేశారు. అయితే ఇది కూడా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఇదిలా ఉంటే ఇటీవల మధురైలో పార్టీ 7వ మహా సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శరత్‌ కుమార్‌ 2026 తనను ముఖ్యమంత్రిని చేస్తే 150 ఏళ్ల పాటు జీవించే రహస్యం చెబుతానన్నారు. దీంతో అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు.

‘నాకు ఇప్పుడు 69 ఏళ్లు.. కానీ 25 ఏళ్ల వ్యక్తిగానే భావిస్తాను. నేను 150 ఏళ్లు జీవిస్తాను. వచ్చే ఎన్నికల్లో నన్నుముఖ్యమంత్రిని చేస్తే అన్నేళ్లు బతికే ఉపాయం చెబుతా. ధృడ సంకల్సం ఉన్న వారే నాయకుడు కావాలి. జాతీయతకు ప్రాధాన్యతనివ్వాలి. వీటన్నింటికీ మించీ కృషి, నిజాయితీ, శారీరక, మానసిక బలం అవసరం’ అని శరత్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు. ఆయన ఏ ఉద్దేశంలో ఈ మాటలన్నారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. కొందరు వీటిపై సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..