Superstar Rajinikanth : మరోసారి ఆ దర్శకుడితో సూపర్ స్టార్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి..
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఇటీవల రాజకీయ పార్టీ పెట్టాలని చూసిన ఆరోగ్యం సహకరించక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఇటీవల రాజకీయ పార్టీ పెట్టాలని చూసిన ఆరోగ్యం సహకరించక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే కొంతకాలం విశ్రాంతి తీసుకున్న సూపర్ స్టార్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే తనతో ఓ సినిమా చేసిన దర్శకుడికి మరో అవకాశం ఇచ్చారని తెలుస్తుంది.
రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమా ప్రేక్షకులను ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. తాజాగా సమాచారం ప్రకారం మరోసారి రజినీ ని కార్తీక్ డైరెక్ట్ చేయబోతున్నాడట. రజినీ ప్రస్తుతం ‘శంఖం’ ఫేమ్ శివ దర్శకత్వంలో తన 168వ సినిమాను పూర్తిచేస్తున్నాడు. రజినీ – శివ కాంబినేషన్ మూవీకి ‘అన్నాతే’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా తర్వాత కార్తీక్ తో సినిమా ఉండనుందట. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్తుందని టాక్ నడుస్తుంది. అలాగే ఆ సినిమా 2022 దీపావళికి విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :